అనుకోకుండా జరిగిన సంఘటన అయినప్పటికీ కేవలం వారం రోజుల గ్యాప్ తో ఇద్దరు హీరోయిన్స్  లాయర్ గెటప్ లో నటించిన ‘నాంది’ ‘చెక్’ సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలలో  వరలక్ష్మి రకుల్ ప్రీత్ సింగ్ పోషించిన లాయర్ పాత్రల పై ఇప్పుడు ఆసక్తికర కామెంట్స్ రావడమే కాకుండా ఈ రెండు సినిమాలలో ఏ లాయర్ పాత్ర  సహజంగా ఉంది అన్న కోణంలో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.


‘నాంది’ సినిమాలో లాయర్ ఆద్య పాత్రలో వరలక్ష్మి నటిస్తే ‘చెక్’ మూవీలో లాయర్ మానస పాత్రలో రకుల్ ప్రీత్ నటించింది. అయితే ‘నాంది’ సినిమాలో వరలక్ష్మి తన పాత్రకు న్యాయం చేస్తే రకుల్ ప్రీత్ తన పాత్రకు మాత్రం ఎటువంటి న్యాయం చేయలేక పోవడంతో ‘చెక్’ పరాజయానికి పరోక్షంగా రకుల్ ప్రీత్ కూడ కారణం అయిందా అంటూ కొందరు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.


ఇప్పటికే రకుల్ ప్రీత్ ఐరన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకంది. దీనికితోడు ‘చెక్’ మూవీ ఫెయిల్ అవ్వడంతో రకుల్ ప్రీత్ కు మరిన్ని కష్టాలు తప్పవు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికితోడు వరలక్ష్మి కి మాత్రం లక్ పరుగులు తీస్తోంది. ఆమె నటించిన ‘క్రాక్’ ‘నాంది’ ఈ రెండు సినిమాలు విజయం సాధించడంతో ఇప్పుడు వరలక్ష్మి పై తెలుగు దర్శక నిర్మాతల దృష్టి పడింది.


నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడానికి వరలక్ష్మి ముందుకు వస్తున్న పరిస్థితులలో ఆమెకు తెలుగులో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది. వాస్తవానికి గతంలో మంచు లక్ష్మి ఇలాంటి నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ తెలుగు ప్రేక్షకుల నుండి ఆమెకు సరైన స్పందన కరువైంది. దీనితో మంచులక్ష్మి కి లేని అదృష్టం వరలక్ష్మి ని వరించింది. ఇద్దరూ లక్ష్మిలే అయినా అదృష్టంలో ఉన్నతేడా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ వరలక్ష్మి మ్యానియాకు సహకరిస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: