ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వతహాగా వచ్చి హీరో గా నిలబడ్డ వారిలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ముందు అసిస్టెంట్ డైరక్టర్ గా చేరి ఆ తర్వాత హీరోగా మారాడు నాని. మొదటి సినిమా అష్టా చమ్మా నుండి రాబోతున్న టక్ జగదీష్ వరకు తన నాచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక నాని కెరియర్ లో 25 సినిమాలు రిలీజ్ అయ్యాయి. టక్ జగదీష్ 26, శ్యాం సింగ రాయ్ 27, అంటే సుందరానికీ 28వ సినిమాగా వస్తుంది. అయితే నాని తన కెరియర్ లో తన దగ్గరకు వచ్చిన ఓ పది సినిమాలు రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

ఇంతకీ ఆ పది సినిమాలు ఏంటి నాని కాదన్నాడు కదా అవి ఆడాయా లేదా.. నాని ఎందుకు కాదన్నాడు అన్నది చూస్తే.. నాని కాదన్న సినిమాల్లో సాయి ధరం తేజ్ సుప్రీం ఉంది. అది మెగా మేనల్లుడు కెరియర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చింది. సినిమాలో మెగా మార్క్ కనిపించడంతో హిట్ అయ్యింది. బహుశా నాని చేసి ఉంటే ఎలా ఉండేదో.. నానికి పిల్ల జమిందార్ సినిమాతో హిట్ ఇచ్చిన అశోక్ డైరక్షన్ లో వచ్చిన సుకుమారుడు ఆఫర్ కూడా వచ్చిందట కాని నానిసినిమా చేయలేదు. ఇక నాగ చైతన్య తడాఖా సినిమా కూడా నాని చేయనని చెప్పాడట. ఇది తమిళ సినిమా వెట్టైకి రీమేక్ గా వచ్చింది.

నితిన్ సూపర్ హిట్ మూవీ గుండెజారి గల్లతయ్యిందే సినిమా కూడా నాని కే ముందు ఆఫర్ రాగా కొన్ని కారణాల వల్ల కాదన్నారట. ఇక నాని కాదన్న వాటిలోనే రాజ్ తరుణ్ ఉయాల జంపాల, నాగార్జున ఊపిరి సినిమా కూడా ఉన్నాయి. ఊపిరి సినిమాలో కార్తీ చేసిన ఈ పాత్రకు ఎన్.టి.ఆర్, నానిలను అనుకున్నాడు వంశీ పైడిపల్లి. ఇవే కాదు మహానటిలో నాగేశ్వర రావు పాత్రకు నానిని అనుకున్నాడట నాగ్ అశ్విన్. శర్వానంద్ శ్రీకారంలో కూడా నాని నటించాల్సి ఉంది. జాను కూడా నాని దగ్గరకు వస్తే చేయలేనని చెప్పాడట. ఇక ప్రస్తుతం హను రాఘపుడి, దుల్కర్ సల్మాన్ తో వస్తున్న సినిమా ఆఫర్ ముందు నానికి వెళ్తే ఎందుకో చేయనని చెప్పాడట. ఇలా పది సినిమాలు నాని కాదన్న తర్వాతే వేరే హీరో దగ్గరకు వెళ్లాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: