ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై రాకేష్ మాస్టర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు యూట్యూబ్ వేదికగా సంచలనం సృష్టించిన రాకేష్ మాస్టర్ ప్రస్తుతం జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానోఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఒకప్పుడు యూట్యూబ్ లో ఎక్కడ చూసినా రాకేష్ మాస్టర్ కనిపించాడు. అందరి పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు  హాట్ టాపిక్ గా మారిపోయాడు. దీంతో యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపాయి. తర్వాత సడన్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో అటు అందరూ షాక్ అయ్యారు.


 జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి బుల్లెట్ భాస్కర్ టీమ్ లో కామెడీ చేస్తున్నాడు ప్రస్తుతం రాకేష్ మాస్టర్. తనదైన శైలిలో కామెడీ చేస్తూ అటు రాకేష్ మాస్టర్ బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాడు అని చెప్పాలి. అయితే రాకేష్ మాస్టర్ బుల్లెట్ భాస్కర్ టీం లోకి వచ్చి నప్పటి నుంచి రాకేష్ మాస్టర్ ని తెగ వాడేస్తున్నాడు బుల్లెట్ భాస్కర్.  రాకేష్ మాస్టర్ పై దారుణమైన పంచులు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులు అందరినీ నవ్విస్తూ ఉండటం లాంటివి చేస్తున్నారు. అయితే రాకేష్ మాస్టర్ ఇటీవల ఏకంగా చీరకట్టులో ఎంట్రీ ఇచ్చి లేడీ గెటప్ లో అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.


 రాకేష్ మాస్టర్ లేడీ గెటప్ చూసి అటు బుల్లితెర ప్రేక్షకులు అందరూ అవాక్కయ్యారు అని చెప్పాలి. అయితే మొన్న చీరకట్టుతో నే ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసిన రాకేష్ మాస్టర్ ఇక ఇప్పుడు ఏకంగా గే గెటప్ వేసుకుని అందరికీ ఊహించని షాక్ ఇచ్చారు.  ఇటీవల విడుదలైన జబర్దస్త్ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.ఈ ప్రోమోలో భాగంగా బుల్లెట్ భాస్కర్ స్కిట్ చేస్తున్న సమయంలో... మొదట జబర్దస్త్ నరేష్ గే గెటప్ వేసుకొని ఎంట్రీ ఇస్తాడు. ఇక ఆ తర్వాత రాకేష్ మాస్టర్ గే గేటప్ వేసుకుని ఎంట్రీ ఇవ్వడం తో అందరూ అవాక్కవుతారు. ఏమైనా రాకేష్ మాస్టర్ ని జబర్దస్త్ లో తెగ వాడేస్తున్నారు అని అనుకుంటున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: