మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్ నటన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. హీరోగా అయినా.. విలన్‌గా అయినా ఆఖరికి ఏ సైడ్ క్యారెక్టర్‌లో అయినా సరే తనదైన నటనతో మెప్పిస్తుంటారు. ఆయన నటిస్తున్నారంటే ఆ సినిమా పక్కాగా సూపర్ డూపర్ హిట్టవ్వాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని కొన్ని పాత్రలు మోహన్‌‌కు తప్ప మరెవరికీ సెట్ అవ్వవు అనే రీతిలో ఉంటాయి. ఇందుకు ఉదాహరణే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ‘జనతాగ్యారేజ్’ చిత్రం. నిజంగా ఈ సినిమాలో ఆ పాత్రలో మోహన్ లాల్ కాకుండా మరెవరైనా నటించి ఉంటే అంత సెట్టయ్యేది కాదేమో అన్నట్లుగా వందకు వంద శాతం పాత్రకు న్యాయం చేశారు.

 ఆ తర్వాత తెలుగు సినిమాలో.. అది కూడా కీలక పాత్రలో నటించిన సినిమాలేమీ లేవు.మలయాళ సినిమాలోనే నటిస్తూ వస్తున్న మోహన్ లాల్.. ‘దృశ్యం2’ ఘన విజయం తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఆయన కొత్త సినిమా అరట్టు అనే సినిమా టీజర్ ఈ మద్యనే విడుదలయ్యింది. అయితే ఈ సినిమా టీజర్ లో ఒక ప్రత్యేకమైన విశేషం ఉంది. అదేంటి అంటే ఈ టీజర్ లో మోహన్ లాల్ "నేను వాడిని చంపేస్తాను" అనే డైలాగ్ చెప్పారు. ఈ టీజర్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రేండింగ్ అవుతుంది.

అలాగే ఈ సినిమాలో మోహన్ లాల్ ఫైట్స్ కూడా సూపర్ గా చేశారు అని టాక్. ఈ వయసులో ఆయన భారీ ఫైట్స్ చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.ఇక వరస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న మోహన్ లాల్ కి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ ఇస్తుందో వేచి చూడాలి. అలాగే ఆయన తెలుగులో డైలాగు చెప్పడంతో ఈ టీజర్ ని తెలుగు ఆడియన్స్ కూడా చూడటం మొదలుపెట్టారు.ఈఈ అరట్టు సినిమాని ఉన్ని కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: