ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లు హీరోలుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టిస్తుండ‌గా కొముం భీమ్ ఎన్టీఆర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. అయితే ఈ సినిమా నుండి భీం ఫ‌ర్ రామ‌రాజు పేరుతో రామ్ చ‌ర‌ణ్ టీజ‌ర్ ను వ‌ద‌ల‌గా.... రామ్ ఫ‌ర్ కొమురం భీం అనే పేరుతో ఎన్టీఆర్ టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. ఇక ఇప్టటికే ఈ రెండు టీజ‌ర్ లు యూట్యూబ్ ను షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా ఎన్టీఆర్ టీజ‌ర్ రామ్ ఫ‌ర్ కొమురం భీం టీజ‌ర్ స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. టాలీవుడ్ చ‌రిత్రలో ఎన్టీఆర్ టీజ‌ర్ మ‌రో రికార్డును క్రియేట్ చేసింది. అదేంటంటే ఇప్ప‌టివ‌ర‌కు టాలీవుడ్ హీరోల టీజ‌ర్ ల‌లో వ‌న్ మిలియ‌న్ లైక్స్ సంపాదించిన మొద‌టి టీజ‌ర్ గా ఎన్టీఆర్ టీజ‌ర్ నిలిచింది. 

అంతే కాకుండా ఇటీవ‌లే ఈ టీజ‌ర్ 50 మిలియ‌న్స్ వ్యూవ్స్ సంపాదించి ఓ రికార్డును సొంతం చేసుకోగా ఇప్పుడు ఎన్టీఆర్ మ‌రో రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇప్పుడే ఇలా ఉంటే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌లయ్యాక ఎటాంటి రికార్డులు బ్రేక్ చేస్తాడో చూడాలి మ‌రి. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. అంతే కాకుండా షూటింగ్ కూడా చివ‌రి దశ‌కు చేరుకుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. రాజ మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమా పై విడుద‌ల‌కు ముందే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అంతే కాకుండా బాహుబ‌లి సినిమాతో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవ‌డంతో ప్ర‌స్తుతం అన్ని ఇండ‌స్ట్రీల చూపు ఆర్ఆర్ఆర్ సినిమాపైనే ఉంది. మ‌రో వైపు ఈ సినిమాపై మ‌రింత ఆస‌క్తిని పెంచేందుకు తెలుగు న‌టుల‌నే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ న‌టీన‌టుల‌ను కూడా సినిమాలో జ‌క్క‌న్న భాగం చేశారు. ‌

మరింత సమాచారం తెలుసుకోండి: