మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ నటిస్తున్న తాజా చిత్రం "సూపర్ మచ్చి" ఈ సినిమాకి పులి వాసు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్, ఖుషి కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చిత్రం థియేటర్లో విడుదల చేసే ఛాన్స్ కనబడడం లేదు. అలాగని రెడీ అయిన సినిమాను ఎక్కువ కాలం ప్రేక్షకుల ముందుకు తీసుకు రాకపోతే స్టొరీ లైన్ ప్రజల్లోకి వెళ్లడంతో, కథ పాత పడిపోవడం, తదితర సినీ సమస్యలు ఎదురవుతాయి అన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే కొన్ని సినిమాల దర్శక నిర్మాతలు ఓటిటిలో విడుదల చేయాలనే విషయంపై ఎటూ తేల్చుకోలుకున్నారు. ఇదిలా ఉండగా కళ్యాణ్ దేవ్ "సూపర్ మచ్చి" చిత్రాన్ని కూడా ఓటిటి వేదికపై విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అల్లు అరవింద్ ప్లాన్ చేసిన ఆహా యాప్ లో ఈ సినిమా వచ్చే నెల విడుదల చేయబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే ఆధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఈ సినిమాలో  నట కిరీటి  రాజేంద్ర ప్రసాద్, రచితా రామ్, పోసాని కృష్ణ మురళి, నరేష్‌, భద్రం, ప్రగతి, అజ‌య్‌,  ‘జబర్దస్త్’ మహేష్,  పృథ్వీ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. కళ్యాణ్ దేవ్ మొదటి చిత్రం "విజేత" ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోక పోయినప్పటికీ... హీరో కళ్యాణ్ మాత్రం తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమా తన కెరీర్ ను మలుపు తిప్పే సూపర్ హిట్ అందిస్తుందని నమ్ముతున్నాడు కళ్యాణ్ దేవ్.

మరింత సమాచారం తెలుసుకోండి: