తెలుగు గడ్డపై ఆత్రేయ పేరు తెలియని వాళ్ళు బహుశా ఉండరేమో.. ఎన్నో పద్యాలను, పాటలను, మాటలను , సినిమాలను అందించిన ఘనత ఆత్రేయ గారిది.. ఆయన తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహా పండితుడు.. ఆయన రాసిన పాటలు సంగీతానికే సరిగమలు నేర్పించాయి అనడంలో ఎటువంటి సందేహాలు లేవు..అలాంటి మనసు చుట్టూ పాటను ప్రదక్షిణం చేయించిన రచయితగా ఆత్రేయ కనిపిస్తారు.ఆత్రేయ అసలు పేరు వెంకట నరసింహా చార్యులు .. అయితే గోత్రం పేరైన 'ఆత్రేయ'తోనే రచయితగా అడుగులు వేశారు. 


1950 'దీక్ష' సినిమాతో పాటల రచయితగా ఆయన సినీ ప్రయాణం మొదలైంది..అప్పటి నుంచి ఆయన తన పెన్నుకు తిరిగి క్యాప్ పెట్టే అవసరం లేకుండా పోయింది. తెలుగులో ఫలానా కవి ఫలానా తరహా పాటలు బాగా రాస్తారు అని అప్పటి వరకూ చెప్పుకునేవారు. ఆలాపన గీతాలు , శృంగార గీతాలు, విలయ గీతాలు, భావగీతాలు.. ఇలా ఒకటేమిటి ఎన్నో వినసొంపైన పాటలను అందించిన ఘనత ఆత్రేయ గారిది..అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పాటలు వినపడుతున్నాయి. 


ఆత్రేయ పాటల రచయితగా అడుగుపెట్టినప్పుడు కవులు ఎంతోమంది బలమైన తమ కలాలతో బరిలో ఉన్నారు. వాళ్ల అక్షర ప్రవాహాన్ని తట్టుకుని నిలబడటమే కష్టం. అయినా ఆత్రేయ తడబడలేదు .. తనకి తెలిసిన తేలికైన పదాలతోనే ఆయన విన్యాసాలను చేశారు. మాటల రచయితగా మంచి పేరును తెచ్చుకున్నాడు.ఆత్రేయ రాసిన మాటల్లో వేదాంతం .. ఆ పాటల్లో జీవనసారం దాగున్నాయనే విషయాన్ని ఆ కవులంతా గుర్తించారు. పామరులు మాత్రం హాయిగా ఆ పాటలను పాడుకున్నారు .. ఆయన పాటలను వర్ణించడం అంటే బహుశా ఆ బ్రహ్మ తరం కూడా కాదేమో.. మనసుకవిగా మనసులు దోచిన ఆత్రేయ శత జయంతి ఈ రోజు .. ఈ సందర్భంగా ఆ పాటల రారాజును మనసారా స్మరించుకుందాం..ఆయన పాటలతో మరోసారి మనసు ప్రశాంతంగా ఉంచుకుందాం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: