ఇలా వినగానే చాలు..అలా మైమరచి పోయే ఎన్నో కథలను మనకందించి, చిన్న పిల్లలు సైతం వినసొంపుగా వినే పాటలను మన తెలుగు వారికి సొంతం చేసిన ఆచార్య ఆత్రేయ గారికి  శతకోటి వందనాలు. ఇక ఈ రోజు ఆయన శత దినోత్సవ జయంతి కారణంగా ఆయన రచించిన ఎన్నో పాటలలో కొన్ని పాటలను మనం ఇప్పుడు గుర్తుచేసుకుందాం..

" ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో " అనే ఈ పాట ఇలా వినగానే చాలు, అలా మైమరచి పోతాము. ఇక ఈ పాట రాసిన ఆత్రేయ, గొప్ప భావకవి ఏమో అని సందేహం కలగకమానదు. "కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన "అనే పాటను రాశారు. ఇక ఈ పాట విన్న వారంతా   గొప్ప సామ్యవాద  కవి ఏమో అనుకున్నారు. "నేనొక ప్రేమ పిపాసిని" అని రాస్తే,ఇంతకుమించిన వైరాగ్య కవి లేడు అని అందరూ అన్నారు.

"మనసు గతి ఇంతే, మనసు బ్రతుకంతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే " అని అంటే ఇక మన తెలుగు భాషలో ఇతని కన్నా మనసున్న కవి ఇంక ఎక్కడున్నారు? అని అనుకునేలా చేశారు. "ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ" అనగానే బాబోయ్..! ఆత్రేయ కాదు ఈయన బూత్రేయ అని అన్నారు.. ఇక కటాక్షించిన వారికి కాదనకుండా, ఎవరు ఎలా కోరితే అలా దేవుడు కదా! భక్తుడికి వరం ఇచ్చినట్టు, మన ఆత్రేయ  ఏ పాట కావాలంటే ఆ పాటను వారికి కటాక్షించారు..

ఇక వంద సంవత్సరాల వరకు, కాదు.. కాదు..మరో వెయ్యి సంవత్సరాల వరకు నిలబడేది ఏమిటంటే ఆయన గానామృతం, మనకందించిన ఎన్నో పాటలు." నా పాట నీ నోట పలకాల చిలక"  అనే ఈ పాటను ఎలా రాశారో కానీ, ఆయన పాట తెలుగు వారి నోట పలుకుతూనే ఉంది. ఇక అలాగే ఆత్రేయ తెలుగు సినిమా పాటకు, మాటకు చేసిన కటాక్షం అంత సామాన్యమైనది కాదు. మరో వెయ్యి సంవత్సరాలు గడిచినా ఆయన పాటలను ప్రతి ఒక్కరు స్మరిస్తూనే ఉంటారు.

ఆత్రేయ "ఈనాడు " అనే ఒక నాటకం రాశారు. అది దేశ విభజన సమయంలో సామరస్యాన్ని  బోధించడానికి చేసిన ప్రయత్నంగా ఆయన ఈ నాటకాన్ని రాశారు. ఇక ఈ నాటకంలో ఒక హిందువు మిత్రుడు, ఒక ముస్లిం మిత్రుడికి దేశ స్వాతంత్రం వచ్చిన సందర్భంగా గాంధీ గారి బొమ్మను బహూకరించాడు. కానీ ఆఖరికి నాటకం చివరిలో ఒక మతోన్మాది విసిరిన కత్తికి, ఆ గాంధీ బొమ్మ ముక్కలవుతుంది. ఈ నాటకాన్ని 1948 సంవత్సరం జనవరి 30వ తేదీన నెల్లూరులో ప్రదర్శించారు. కానీ అదేరోజు గాంధీ మీద అలాంటి దాడి జరిగి ఆయన ప్రాణాలు కోల్పోయారు..


ఇది ఆత్రేయ ముందుచూపు కు నిదర్శనమని అనుకున్న వారు లేకపోలేదు. ఇక ఈ వార్త తెలుసుకున్న ఆత్రేయ తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లి పోయారు. గాంధీ గారిని హత్య చేయడం ఏమిటి? ఏమిటి ఇదంతా? మనిషి అనేవాడు ఇలా కూడా ఉంటాడా ? ఇక తీవ్ర డిప్రెషన్ కు గురి అవడంతో, ఆత్రేయ బంధువులు తమ ఊరికి తీసుకెళ్ళి, రెండు మూడు నెలలు ఉంచుకొని,తిరిగి మామూలు మనిషిని చేసి పంపించాల్సి వచ్చింది..


మరింత సమాచారం తెలుసుకోండి: