రెండు దశాబ్దాల పాటు ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేసిన పరుచూరి కలానికి ఇప్పుడు పవర్ తగ్గింది. నేటితరం ప్రేక్షకులకు నచ్చే విధంగా కథలు డైలాగ్స్ పరుచూరి బ్రదర్స్ వ్రాయలేకపోతున్నారు. దీనితో పరుచూరి గోపాలకృష్ణ ఖాళీగా ఉండకుండా ‘పరుచూరి పలుకులు’ అనే వెబ్ ఛానల్ పెట్టుకుని ఆ ఛానల్ ద్వారా ఆతరం హీరోలు నటించిన అలనాటి సూపర్ హిట్ సినిమాల గురించి అదేవిధంగా అప్పటి హీరోల ఇగోల గురించి తనదైన తీరులో ఇప్పటి తరం వారికి అర్థం అయ్యే విధంగా విశ్లేషణలు చేస్తున్నాడు.


లేటెస్ట్ గా పరుచూరి ‘వకీల్ సాబ్’ మూవీ గురించి చేసిన కామెంట్స్ పవన్ అభిమానుల మధ్య వైరల్ గా మారాయి. ‘పింక్’ రీమేక్ గా ‘వకీల్ సాబ్’ మూవీని తీస్తున్నట్లు ప్రకటన రాగానే ఈమూవీని ఎవరు చూస్తారు అని తాను భావించానని ఇప్పటికే హిందీలో అదేవిధంగా తమిళంలో వచ్చిన ఈ మూవీని లక్షలాది మంది యూట్యూబ్ లో చూసిన నేపధ్యంలో ‘వకీల్ సాబ్’ ను ఎంత డిఫరెంట్ గా తీసినా జనం చూస్తారా అన్న సందేహాలు తనకు కలిగాయని కామెంట్ చేసాడు.


అయితే ఈమూవీని చూడటానికి వేలాది సంఖ్యలో ధియేటర్లకు వచ్చిన వారిని చూస్తే వారు ‘వకీల్ సాబ్’ మూవీ కథ కోసం కాకుండా మూడు సంవత్సరాల తరువాత తిరిగి స్క్రీన్ పై కనిపించబోతున్న పవన్ ఎలా నటించాడు అన్న ఆతృతతో జనం ధియేటర్స్ వచ్చారని పరుచూరి అభిప్రాయం. అంతేకాదు అలా ధియేటర్స్ కు వచ్చిన జనం ‘వకీల్ సాబ్’ కథలో కొత్తదనం గురించి ఆలోచన చేయకుండా కేవలం పవన్ ను మాత్రమే చూసారని అందువల్లనే ఆమూవీ ఆస్థాయి విజయం సాధించిందని పరుచూరి భావన.


ఇదే సందర్భంలో పవన్ మ్యానియా గురించి మాట్లాడుతూ సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా టాప్ హీరోగా కొనసాగే అదృష్టం ఒక్క పవన్ కు మాత్రమే సొంతం అంటూ అలాంటి అదృష్టం అందరికీ దక్కదు అంటూ పరుచూరి పవన్ మ్యానియా పై షాకింగ్ కామెంట్స్ చేసాడు..



మరింత సమాచారం తెలుసుకోండి: