తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం దర్శకుడిగా ఒక్కో సినిమా విజయంతో ఎంతో గొప్ప పేరు దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి, ఆ మూవీతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత మరొక్కసారి ఎన్టీఆర్ తో ఆయన తీసిన సింహాద్రి మూవీ భారీ హిట్ కొట్టి దర్శకుడిగా రాజమౌళి కి మరింత పేరు తెచ్చిపెట్టింది. అనంతరం సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ సినిమాలతో వరుసగా సక్సెస్ లు అందుకుంటూ దూసుకెళ్లిన రాజమౌళి, ఆపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో తొలిసారిగా తీసిన మగధీర మూవీ అతి పెద్ద విజయాన్ని అందుకుని దర్శకుడిగా రాజమౌళి స్థాయిని మరింత పెంచింది.

ఆ తరువాత సునీల్ తో మర్యాద రామన్న, అలానే నాని, సమంతల కలయికలో ఆయన తీసిన ఈగ సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయి. ఇక ఆ సినిమాల అనంతరం ప్రభాస్, అనుష్క, తమన్నా ల కలయికలో రాజమౌళి తీసిన భారీ ప్రతిష్టాత్మక మూవీస్ బాహుబలి, బాహుబలి 2. ఇక ఈ సిరీస్ లోని రెండు పాన్ ఇండియా సినిమాలు కూడా ఒక దానిని మించేలా మరొకటి అత్యద్భుతంగా విజయాలు అందుకోవడంతో పాటు వందల కోట్ల కలెక్షన్ ని ఆర్జించి తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా వెలుగెత్తి చాటాయి. దానితో రాజమౌళి కి దర్శకుడిగా ఎంతో గొప్ప పేరు లభించింది.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ల తో కలిసి ఆర్ఆర్ఆర్ అనే భారీ పాన్ ఇండియా మూవీ తీస్తున్నారు రాజమౌళి. ఆ విధంగా కెరీర్ లో ఇప్పటివరకు ఒక పరాజయం కూడా చూడని దర్శకుడిగా తన హవా కొనసాగిస్తున్నారు జక్కన్న. ముఖ్యంగా ఒక సాదా సీదా స్టోరీ ని సైతం మంచి యాక్షన్, ఎమోషనల్ అంశాలతో రక్తికట్టించి దానిని ఆడియన్స్ మనసుకు చేరువ చేయడంలో దిట్టగా రాజమౌళి ని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చెప్పాలంటే బాహుబలి రెండు సినిమాలతో రాజమౌళి కేవలం తెలుగు సినిమానే కాదు యావత్ భారతీయ సినిమా స్థాయిని మరింతగా పెంచారు. మరి రాబోయే రోజుల్లో తన సినిమాలతో ఆయన ఏ స్థాయి విజయాలు అందుకుంటారో చూడాలి ..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: