గతంలో ఇంటర్ నెట్ ఛానల్స్ లేని రోజులలో సినిమాలు మాత్రమే జనానికి  ఆనందాన్ని కలిగించే సాధనాలు. ఆ రోజులలో సంక్రాంతికి చిరంజీవి బాలకృష్ణల  సినిమాలు పోటాపోటీగా విడుదల అవుతూ ఒక యుద్ధ వాతావరణం కనిపించేది. ముఖ్యంగా సంక్రాంతి వార్ లో కొన్నిసార్లు చిరంజీవి విజేత అయితే మరి కొన్ని సార్లు బాలకృష్ణ విజేతగా మారేవాడు.  


ఆనాటి రోజులలో వీరిద్దరి మధ్య జరిగిన ఆ పోటీ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు రాక ముందు యాక్షన్ ప్లాన్ ప్రకారం చిరంజీవి ‘ఆచార్య’ మే రెండవ వారంలో విడుదల అయితే బాలకృష్ణ ‘అఖండ’ ను మే 28న విడుదల చేయడానికి డేట్స్ లాక్ చేసారు. అయితే  లాక్ డౌన్   పరిస్థితులు ఏర్పడటంతో మే లో విడుదల కావలసిన టాప్ హీరోల సినిమాలు అన్ని వాయిదా పడ్డాయి.  


దీనితో భారీ అంచనాలు ఉన్న ‘ఆచార్య’ ‘అఖండ’ మూవీలు సంక్రాంతి రేసు పై కన్ను వేసిన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న వార్తల ప్రకారం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు మరో రెండు నెలలో అందుబాటులోకి వచ్చినా థియేటర్స్ సీటింగ్ పై 50 శాంతం ఆంక్షలు ఈ ఏడాది చివరి వరకు కొనసాగే ఆస్కారం ఉంది.


దీనితో పరిస్థితులు సంక్రాంతి సమయానికి చక్కపడతాయి అన్న ఆలోచనలతో చిరంజీవి బాలకృష్ణల ఫైట్ కు మళ్ళీ రంగం సిద్ధం అయింది అంటున్నారు. ఇప్పటికే ‘అఖండ’ టీజర్ 54 మిలియన్ వ్యూస్‌ తో దుమ్ము లేపుతున్న పరిస్థితులలో భారీ అంచనాలు ఉన్న ‘ఆచార్య’ కు గట్టి పోటీ ఇచ్చే ఆస్కారం కనిపిస్తోంది. అయితే రాబోయే సంక్రాంతి రిలీజ్ ను చాలా ముందుగా బుక్ చేసుకున్న  మహేష్ ‘సర్కారి వారి పాట’ పరిస్థితి ఏమిటి అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న..



మరింత సమాచారం తెలుసుకోండి: