సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్లాది మంది అభిమానులు ఆయన సొంతం.లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారి వారసునిగా ఇండస్ట్రీకి వచ్చి ఆయన లాగే పెద్ద సూపర్ స్టార్ అయ్యాడు.ఇక సూపర్ స్టార్ మహేష్ బాలనటుడిగా పదుల సంఖ్యలో సినిమాల్లో నటించిన రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ సూపర్ స్టార్ గా వరుస విజయాలతో దూసుకెళుతున్నారు.అలాగే తన సతీమణి నమ్రత తో కలిసి పలు సమాజ సేవలు కూడా చేస్తున్నారు.


ఎంతోమంది చిన్న పిల్లలకు ఉచితంగా గుండె సంబంధిత ఇక వేరే అనారోగ్య చికిత్సలు చేయిస్తున్నారు. అలాగే రెండు గ్రామాలు దత్తత తీసుకొని వాటిని అభివృద్ధి చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే..భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుసగా మూడు హిట్లు సాధించిన మహేష్ బాబు కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాత సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొననున్నారు. త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ను కూడా త్వరలోనే ప్రారంభించాలని సూపర్ స్టార్ భావిస్తున్నారు.


అయితే ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన అభిషేక్ నామా తాజాగా మన సూపర్ స్టార్ గొప్పదనం, మంచి తనం గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.సూపర్ స్టార్ మహేష్ డిస్ట్రిబ్యూటర్ నష్టపోతారని తెలిస్తే అస్సలు తట్టుకోలేరని పిలిచి మరీ మహేష్ డబ్బులిస్తారని అభిషేక్ నామా చెప్పారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు మాత్రమే ఇలా చేస్తారని ప్రొడక్షన్ హౌస్ తో సంబంధం లేకుండా తరువాత సినిమా ఆయనతో చేయకపోయినా మహేష్ డబ్బులు ఇస్తారని అభిషేక్ నామా చెప్పారు.


అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాకు తనకు 80 శాతం నష్టం వచ్చిందని అభిషేక్ నామా పేర్కొన్నారు. హార్ట్ ఎటాక్, లోఫర్ సినిమాలతో తనకు నష్టం రాగా పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాను ఇచ్చి ఆ నష్టాలను భర్తీ చేసినట్టు అభిషేక్ నామా తెలిపారు. ఈ విషయం తెలిసి నెటిజన్లు మహేష్ బాబు ఇంత మంచి వ్యక్తా..? అని కామెంట్లు చేస్తున్నారు.ఇక అభిమానులైతే మా బాబు బంగారం. మా బాబు మనసు వెన్న అని మహేష్ గొప్పదనాన్ని చాటి చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: