ఇప్పుడు వరకు అందరికీ సన్నీ లియోన్ గురించి తెలుసు.. కానీ సన్నీ లియోన్ మరదలు గురించి చాలామందికి తెలియదు. ఇక ఇటీవల సన్నిలియోన్ మరదలు ఎవరు అనే దాని పై ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ కరిష్మా నాయుడు సన్నీ లియోన్ మరదలట. ఇటీవలే దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఒకప్పుడు సన్నీలియోన్ కి పర్సనల్ స్టైలిస్ట్ గా పనిచేసిన కరిష్మా నాయుడు ఆ తర్వాత సన్నీలియోన్ సోదరున్ని పెళ్లి చేసుకుందట.
అప్పటి నుంచి ఇక కరిష్మా కాస్త హాట్బ్యూటీ సన్నీలియోన్ కి మరదలి గా మారిపోయింది. కాగా కరిష్మా నాయుడు టెక్సాస్ లో ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా.. ఫ్యాషన్ స్టైలిష్ట్ గా కూడా పని చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోతూ ఉండడంతో సన్నీలియోన్ మరదలు కరిష్మా నాయుడా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే వీరిద్దరూ ఎన్నో రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒకరి పోస్టులకు ఒకరు లైక్ చేయడం అంతేకాకుండా ఒకరి బర్త్డేలకు ఒకరు విష్ చేసుకోవడం లాంటివి కూడా చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి