ఇక ఇటీవల సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సమంత. డిజిటల్ రంగంలో అడుగుపెట్టి పలు ఓటీటీ ల్లో టాక్ షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతూ వచ్చింది. ఇక సోషల్ మీడియాలో అయితే నిత్యం యాక్టివ్ గా ఉంటూ.. అభిమానులకు టచ్ లో ఉంటూ వస్తోంది.ఇందులో భాగంగానే తాజాగా సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సంచలనంగా మారింది.అదేంటంటే.. తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటోలో సాకీ దుస్తులను ధరించి దాన్ని తనఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది.అయితే ఆ ఫొటోలో తాను వేసుకున్న డ్రెస్ కంటే మామిడికాయను హైలైట్ చేయడంతో ఈ ఫోటో చూసిన నెటిజన్లు.. ఈమెను సామ్.. నువ్వు తల్లి కాబోతున్నవా అంటూ ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు ఫొటోలో సమంత హ్యాపీ మూమెంట్ చూస్తుంటే అది నిజమేనేమో అని అనిపిస్తుంది. దీంతో సోషల్ మీడియాలో అక్కినేని అభిమానులకు సమంత గుడ్ న్యూస్ చెప్పిందంటూ నెటిజన్లు పలు కామెంట్స్ చేస్తూ.. సమంత గర్భవతి అంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు.అయితే గతంలో కూడా సమంత తన ప్రెగ్నెన్సీ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. వాటన్నింటినీ ఖండించిన సంగతి తెలిసిందే. మరో ఇప్పుడు మరోసారి ఈమె గర్భవతి అనే ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. మరి ఈసారి సమంత దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.ఇక ప్రస్తుతం సమంత..గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శాకుంతలం' అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది..!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి