యువ నటుడు విశాల్ ప్రస్తుతం మొత్తం మూడు సినిమాలు చేస్తున్నారు. కాగా వాటిలో ముందుగా ప్రారంభం అయిన డిటెక్టీవ్ పార్ట్ 2 మూవీలో ఆయన పార్ట్ షూటింగ్ కొద్దిరోజుల క్రితం పూర్తి అవ్వగా, ఇటీవల విశాల్, ఆర్య కలిసి నటిస్తున్న ఎనిమి మూవీ కూడా షూట్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఆ రెండు సినిమాల అనంతరం విశాల్ తన కెరీర్ 31వ సినిమాలో ప్రస్తుతం యాక్ట్ చేస్తున్నారు.
తు ప శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ బెస్ట్ మూవీలో యువ భామ డింపుల్ హయతి హీరోయిన్ గా యాక్ట్ చేస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. విశాల్ ఫిలిం ఫాక్టరీ బ్యానర్ పై విశాల్మూవీ ని ఎంతో భారీగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ తమ యూనిట్ మొత్తానికి వ్యాక్సిన్ వేయించడంతో పాటు పక్కాగా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మూవీ షూట్ ని ఇటీవల షూట్ ని హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో ప్రారభించారు.

ప్రస్తుతం నిర్విరామంగా ఈ మూవీ షూట్ జరుగుతుండగా నేడు జరిగిన షూటింగ్ లో భాగంగా హీరో విశాల్ కంటికి కొద్దిపాటి గాయం తగిలింది. సినిమా కోసం ఎంతో శ్రమ పడుతున్న విశాల్ పలు సీన్స్ లో డూప్ లేకుండా యాక్ట్ చేస్తున్నారని, ఒక మాస్ ఫైట్ సీన్ తీస్తున్న సమయంలో హీరో విశాల్ కంటికి గాయం తగిలిందంటూ యూనిట్ కొద్దిసేపటి క్రితం షూటింగ్ మేకింగ్ బిట్ ఒకటి విడుదల చేసింది. అయితే గాయం తగిలిన వెంటనే విశాల్ కి వైద్యులు చికిత్స అందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కంటి పరిస్థితి బాగానే ఉందని సమాచారం. నాట్ ఏ కామన్ మ్యాన్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది ..... !!  


మరింత సమాచారం తెలుసుకోండి: