ఆ మధ్య ఆర్జీవి ని ఇంటర్వ్యూ చేసిన ఆమె మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఆయన ఇంటర్వ్యూ తోనే ఆమెకు బిగ్ బాస్ లో ఛాన్స్ అందుకొని మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే ఆర్జీవీ తో తన అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఓసారి గోవా బీచ్ లో వర్మ తో దిగిన ఫోటో ట్రేండింగ్ గా నిలిచింది. గత కొంతకాలంగా ఆర్జీవి తో ఇంటర్వ్యూ అంటూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది ఈ బ్యూటీ.. ఈమె జిమ్ డ్రెస్ లో వర్మ తో కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. వాటికి మంచి స్పందన వస్తోంది.
ఇకపోతే ఆ ఇంటర్వ్యూ విడుదల కాగా ఆర్జీవి తో అరియనా బోల్డ్ ఇంటర్వ్యూ లో బోలెడన్ని చమక్కులు యువతరంలో చర్చకు వచ్చాయి. ఈ ఇంటర్వ్యూలో ఆర్జివి తనవైన చమక్కులతో పరిహాసం తో అలరించారు. కంటెంట్ ని ఎలా డ్రైవ్ చేస్తే లాజిక్ గా బాగుంటుందన్న లాజిక్ తెలిసిన వర్మ తనదైన శైలిలో బోల్డ్ నెస్ ను ఎలివేట్ చేస్తూ ఈ ఇంటర్వ్యూను ఎంతగానో తీర్చిదిద్దారు. బోల్డ్ గా ఉండాలి కానీ లాజిక్ ఉండాలి అన్న పద్ధతిలో ఇంటర్వ్యూ ఆద్యంతం కొనసాగింది. అయితే అరియనా కు, వర్మ కు మధ్య ఎఫైర్ ఉండనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అన్న ప్రశ్నకు వర్మ " ఎవరు మంచి ఫ్రెండ్ షిప్ ను తట్టుకోలేరు.. అలాంటివి అనుకోకపోతే వారికి నిద్ర పట్టదు. సోషల్ మీడియా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది మనం చేద్దాం.. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు.. అని తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు.