
రూ. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులను తిరగరాసిన "గబ్బర్ సింగ్" సినిమా విడుదలై తొమ్మిది సంవత్సరాలు గడుస్తోంది. అయితే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దబాంగ్ చిత్రానికి రీమేక్ గా వచ్చిన "గబ్బర్ సింగ్" కి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించారు. అయితే మళ్ళీ వీరిద్దరి కాంబోలో సినిమా ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు.
దబాంగ్ సినిమాని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మలిచి టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన హరీష్ శంకర్ సత్తా ఏంటో తమకు తెలుసునని.. ఆయన ఈసారి పవన్ తో కలిసి భారతీయ సినీ చరిత్రలోనే చెక్కు చెదరని రికార్డులను ఖచ్చితంగా సృష్టిస్తారని అభిమానులు కొండంత విశ్వాసం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, వీరిద్దరి కాంబో ప్రాజెక్ట్ కి సంబంధించి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ వార్తలు తెరమీదకు వస్తున్నాయి. కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్ మేకోవర్ గురించి టాక్ రాగా.. ఇప్పుడు మరొక ఆసక్తికరమైన టాక్ బయటకు వచ్చింది.
అదేంటంటే ఈ సినిమాకి హరీష్ శంకర్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా కథ రాస్తున్నారట. దీని అర్థం ఏంటంటే.. వీరిద్దరూ కలిసి తమ చిత్రానికి కథ సిద్ధం చేస్తున్నారట. నిజానికి ఈ సినిమా కథలు రాయడం పవన్ కళ్యాణ్ కి కొత్తేమి కాదు. ఐతే ఈ విషయం మేరకు చిత్ర బృందం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇకపోతే ఇక మంచి సోషల్ మెసేజ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సాలిడ్ ఎంటర్ టైనర్ కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంత అక్కినేని నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి ఉంది.