విశ్వనట కమలహాసన్ ఎంత గొప్ప నటుడో మన అందరికీ తెలిసిందే. ఆయన సాధించిన విజయాలు కూడా ఎన్నో. ఈయన తన నటనతో ఎన్నో అవార్డులను కూడా  అందుకున్న విషయం కూడా తెలిసిందే. ఈయన తరువాత అంతటి ఘనత సాధించిన ఒక యువ హీరో గురించి మనం తెలుసుకుందాం.


అసలు విషయానికొస్తే, ఉదయ్ కిరణ్ 20 ఏళ్ళ వయసు లోనే  సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అతి చిన్న వయసులో ఎన్నో విజయాలు సాధించి కనుమరుగైన హీరో. ఇక కెమెరామెన్ నుంచి దర్శకుడిగా మారిన డైరెక్టర్ తేజ తన మొదటి చిత్రంలో నటించిన ఉదయ్ కిరణ్ "చిత్రం" అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్.
తన మొదటి సినిమాతోనే ఎంతో విజయం సాధించాడు ఉదయ్ కిరణ్. అయితే మరో సారి వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం "నువ్వు నేను". ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తర్వాత చిత్రం"మనసంతా నువ్వే".ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాడు ఉదయ్ కిరణ్. ఈ సినిమా ఎన్నో రోజులు ఆడి విజయవంతంగా పూర్తి చేసుకుంది.

ఇక ఈయన తన మూడవ సినిమా నుంచే హ్యాట్రిక్ సినిమా అందుకున్న హీరోగా ఉదయ్ కిరణ్ చరిత్ర సృష్టించాడు. టాలీవుడ్ లో ఈ ఘనత అందుకున్న మొదటి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. విశ్వ నటి కమలహాసన్ తర్వాత అతి చిన్న వయసులోనే ఫిలింఫేర్ అవార్డు అందుకున్న హీరోగా ఉదయ్ కిరణ్ గుర్తింపు తెచ్చుకున్నాడు.

స్టార్ హీరోలకు  సైతం గట్టి పోటీ ఇచ్చేవారు. ఇక అంతే కాకుండా మహేష్,జూనియర్ఎన్టీఆర్,ప్రభాస్ వంటి  స్టార్ హీరోలతో కలసి వేదికపై కనిపించేవారు. ఉదయ్ కిరణ్" 2003 లో చిరంజీవి ద్వితీయ పుత్రిక"సుస్మిత" తో నిశ్చితార్థం ఆగిపోవడంతో, తన తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు.కానీ కొన్ని  విషయాలు ఉదయ్ కిరణ్ జీవితాన్ని అతలాకుతలం చేశాయి. ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇక అక్టోబర్ 24న 2012న విషిత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. జనవరి 5న 2014లో తన ఇంట్లోనే మరణించాడు. కానీ ఇప్పటికీ ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు.


మరింత సమాచారం తెలుసుకోండి: