కోలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ సినిమా జీవితం ఎలా ఉన్నా పర్సనల్ లైఫ్ మాత్రం గందరగోళంగా నెలకొంది. ఆమె ప్రముఖ దర్శకుడు విజయ్ ను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి జరిగిన కొన్నాళ్ళకి వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం విజయ్ తన దర్శకత్వం పనులు చూస్తుండగా, అమలాపాల్ కూడా సినిమాలు చేస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి సినిమా కు విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

అంతకు ముందు చాలా సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు విజయ్. ఇటు అమలాపాల్ కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మలయాళంలో ఈ నటికి క్రేజ్ బాగా ఉంది. తెలుగు సినిమా పరిశ్రమలో కూడా ఆమె కొన్ని సినిమాలతో అలరించింది. బెజవాడ తో టాలీవుడ్ కి వచ్చిన అమలా లవ్ ఫెయిల్యూర్, నాయక్ , ఇద్దరమ్మాయిలతో, వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. తమిళనాట స్టార్ హీరోయిన్ అయిన ఆమెకు మలయాళంలో కూడా అదే స్థాయి క్రేజ్ ను సంపాదించుకొని అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

అయితే ఈమెకు ఓ స్టార్ హీరో తో ఉన్న లింకు కారణంగానే ఆమె భర్త వదిలేశాడని కోలీవుడ్ వర్గాలు చెబుతుంటాయి. ఆ స్టార్ హీరో కి పెళ్లయింది కూడా. పెళ్లయిన స్టార్ హీరోతో అప్పట్లో ఆమె చెట్టాపట్టాలేసుకుని తిరగడం సంచలనంగా మారగా ఇది విజయ్ కి తెలిసి ఆమెతో విడాకులు కోరాడట. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకొని ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకున్నారు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు ధనుష్ అని అంటారు. కానీ ఈ ఇద్దరి మధ్య ఏది లేదని చాలా కాలంగా బహిరంగంగా చెబుతూనే వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: