గతంలో తెలుగు సినిమాలు చేయాలంటే ఇతర భాషల హీరోలు కొంత తటపటాయిస్తూ చూసేవారు. ముఖ్యంగా కోలీవుడ్ హీరోలు తెలుగు సినిమా అంటే ఆమడ దూరంలో ఉండేవారు.  టాలీవుడ్ కంటే ఎక్కువగా మార్కెట్ ఉండే కోలీవుడ్ ను కాదని తెలుగు లో సినిమాలు చేయాలంటే నిన్న మొన్నటి వరకు ఆలోచించేవారు. కానీ ఇటీవల కాలంలో చూసుకుంటే కోలీవుడ్ హీరోలు తెలుగు సినిమాలపై చూపిస్తున్న మోజు అంతా ఇంతా కాదు. తెలుగులో సినిమా చేయడం కోసం ఇక్కడి తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు.

గతంలో డబ్బింగ్ సినిమాల ద్వారా మాత్రమే తెలుగు ప్రేక్షకులను అలరించే వీరు ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నా రు. అయితే ఇంత సడన్ గా తెలుగు సినిమా పై వారికి ప్రేమ కురవడానికి కారణం లేక పోలేదు. అదే  పాన్ ఇండియా మార్కెట్.  టాలీవుడ్ లో చాలామంది తెలుగు హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలని చేస్తున్నారు. ఆ సినిమాలకు దేశ వ్యాప్తం గా మంచి క్రేజ్ ఉంటుంది. తెలుగునాట వచ్చే సినిమా అంటే చాలు దేశ ప్రేక్షకులు ఎగబడి మరీ చూస్తున్నారు. 

గతంలో సౌత్ అంటే గుర్తుకు వచ్చేది చెన్నై కానీ ఇప్పుడు సౌత్ అంటే హైదరాబాద్ గుర్తుకు వస్తుంది ప్రజలందరికీ. అలా తమిళ హీరోలు తెలుగు సినిమా ద్వారా తమ మార్కెట్ ను ఇండియా వైజ్ గా పెంచుకోవాలని డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.  ఈ క్రమంలోనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ దళపతి, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో సూర్య డైరెక్ట్ తెలుగు సినిమాలు చేస్తున్నారు. వీరే కాకుండా విక్రమ్, కమల్ హాసన్, విజయ్ సేతుపతి, కార్తీ, విశాల్ వంటి హీరోలు కూడా తెలుగులో డైరెక్ట్ సినిమా చేయాలని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: