ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ సర్కార్ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం తనని ఆశ్రయించారని ఆయన అన్నారు. అయితే ఈ సినిమాలోని పాత్ర కోసం తనని భారీగా గడ్డం పెంచాలని రామ్ గోపాల్ వర్మ అడిగారని.. కానీ గడ్డం పెంచడం ఇష్టంలేక వెంటనే ఆఫర్ ని రిజెక్ట్ చేశానని ఆయన అన్నారు.
"రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్ నాకు ఫోన్ చేసి సర్కార్ సినిమాలో ఓ పాత్రలో నటించాలని కోరారు. నేను నో చెప్తే వెంటనే రామ్ గోపాల్ వర్మ నన్ను ఆశ్రయించే అవకాశం ఉంది. అందుకే నేను నో చెప్పలేను. డేట్స్ ఖాళీగా లేవని చెప్పి సున్నితంగా ప్రాజెక్టు నుంచి వైదొలిగాను " అని తనికెళ్ల భరణి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
దీంతో రామ్ గోపాల్ వర్మ తనికెళ్ల భరణి రిజెక్ట్ చేసిన పాత్రలో జీవా ని నటింపజేసారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పక్కన నటించే అవకాశం రావడంతో జీవా ఎగిరి గంతేసారు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్టయి సినీ విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే సినిమా విజయవంతం అయిన తర్వాత తనికెళ్ళ భరణి చాలా పశ్చాత్తాప పడ్డారట. తన సొంత నిర్ణయం కారణంగానే అమితాబ్ బచ్చన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్ని తను కోల్పోయానని ఆయన చెప్పుకొచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి