రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ఏమాత్రం ఊహించని ఈ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీగా లైగర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాను పూరీ, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. సినిమా 65 శాతం వరకు షూటింగ్ పూర్తయిందని చెప్పారు విజయ్ దేవరకొండ. ఇక సినిమా క్లైమాక్స్ కోసం 1000 మందితో షూట్ చేయాల్సి ఉందని అంచనాలు పెంచారు.

లైగర్ క్లైమాక్స్ ఫైట్ 1000 మందితో అని హింట్ ఇచ్చాడు. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాలో చాలా సర్ ప్రైజెస్ ఉన్నాయని తెలుస్తుంది. సినిమాలో విజయ్ విశ్వరూపం చూపిస్తాడట. అందుకే సినిమా నుండి ఎలాంటి లీక్స్ రాకుండా చూస్తున్నారు. అయితే క్లైమాక్స్ ఫైట్ 1000 మందితో అని విజయ్ లీక్ చేయడంతో రౌడీ ఫ్యాన్స్ లో జోష్ పెరిగింది. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు ఫ్లాప్ తర్వాత విజయ్ చేస్తున్న లైగర్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు రౌడీ హీరో.

ఇక ఇస్మార్ట్ శంకర్ హిట్ తో జోష్ మీద ఉన్న పూరీ జగన్నాథ్ ఈసారి నేషనల్ లెవల్ లో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. పూరీ, విజయ్ క్రేజీ కాంబినేషన్ గా వస్తున్న ఈ లైగర్ సినిమా ఆడియెన్స్ కు ట్రీట్ ఇస్తుందని చెబుతున్నారు చిత్రయూనిట్. విజయ్ మాత్రం ఈ సినిమా మీద ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది. సినిమాలో విజయ్, అనన్యా పాండేల రొమాన్స్ కూడా అదిరిపోతుందని అంటున్నారు. తప్పకుండా విజయ్ కు పూరీ ఈ సినిమా హిట్ ఇస్తాడని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాతో అనన్యా పాండే తెలుగు తెరకు పరిచయం అవుతుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: