
కమెడియన్ సునీల్ ప్రస్తుతం హీరోగానే కాకుండా అన్ని రకాల పాత్రలు చేయడానికి ఎంతగానో ఆసక్తి చూపుతున్నాడు. కమెడియన్గా హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేస్తూ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన కెరీర్ ను మళ్లీ నిలబెట్టు కోవడానికి పెద్ద పెద్ద సినిమాల్లో సైతం నటిస్తున్నాడు. పుష్ప ఆచార్య వంటి చిత్రాల్లో తన పాత్రకు మంచి మార్కులు వస్తాయని ఆశిస్తున్నాడు. పుష్ప సినిమాలో సునీల్ పాత్ర హైలైట్ గా నిలువనుందని ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న f3 సినిమా కూడా సునీల్ పాత్ర ఎంతో ఆసక్తికరంగా గా ఉంటుందట. కుటుంబ కథా చిత్రంగా వచ్చిన వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ఎఫ్ 2 సినిమా కు సీక్వెల్ ఇది. తమన్నా మెహరీన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా ఎంత పెద్ద పెద్ద సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రేక్షకుల్లో ఈ సినిమా సీక్వెల్ కోసం డిమాండ్ నెలకొనడంతో ఈ సినిమాను చేస్తున్నాడు అనిల్ రావిపూడి.
దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సునీల్ పాత్ర ఎంతో వెరైటీగా ఉండబోతుందట. పిసినారిగా నటిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించబోతున్నాడట సునీల్. తన రీ ఎంట్రీ లో విలన్ గా సైతం చేసిన సునీల్ పెద్దగా పేరు తెచ్చుకో లేకపోయాడు మళ్ళీ ఈ సినిమాలోని పాత్ర ద్వారా తనకు పూర్వవైభవం వస్తుందని నమ్ముతున్నాడు. మరి సునీల్ కు తప్పకుండా ఓ బ్రేక్ రావాల్సిన సినిమాగా ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల్లో ఏ సినిమా నడుస్తుందో చూడాలి. ఎఫ్3 సినిమా పూర్తి గా డబ్బు చుట్టూ తిరుగుతుందని ఈ సినిమా ద్వారా వెంకటేష్ వరుణ్ తేజ్ లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం గ్యారెంటీ అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు హైలెట్ కానుంది.