తమిళ స్టార్ కమెడియన్ వడివేలు తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు అనే చెప్పవచ్చు. ఈ కమెడియన్ శంకర్ దర్శకత్వం వహించిన 'ప్రేమికుడు' సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తన కామెడీ టైమింగ్ తో బ్రహ్మానందం తర్వాత ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న కమెడియన్ లో ఒకరిగా నిలిచాడు. తమిళ స్టార్ హీరోలు తమ సినిమాలలో వడివేలు కచ్చితంగా ఉండాలి అతను సినిమాలో ఉన్నట్లయితే  సినిమా హిట్ అవుతుంది అని నమ్మే విధంగా ఈ కమెడియన్ ఎదిగాడు.
 

చంద్రముఖి సినిమా సమయంలో ఒక పాత్ర కోసం వడివేలు ను సంప్రదించగా రెండు నెలల వరకు నాకు డేట్స్ ఖాళీగా లేవు అని ఈ కమెడియన్ చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న రజినీకాంత్ ఆ పాత్రకు వడివేలు అయితేనే న్యాయం చేయగలరు అని చెప్పి రెండు నెలల తర్వాత షూటింగ్ ప్రారంభించాడు. ఇంతలా తమిళ సినిమా మార్కెట్ పై ప్రభావం చూపిన ఈ కమెడియన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండడానికి కారణం ఇతని రాజకీయ ప్రస్థానం అని చెప్పవచ్చు. రాజకీయంలో భాగంగా ఇతను కొంతమంది వ్యక్తుల పై చేసిన కామెంట్స్ వల్ల ఇంత కాలం సినిమాలకు దూరంగా ఉండవలసి వచ్చింది. అయితే తాజాగా ఈ కమెడియన్ సీఎం కరోనా నివారణ నిధికి ఐదు లక్షల రూపాయల విరాళం అందజేశారు .


ఈ చెక్కును బుధవారం ఉదయం తమిళనాడు సచివాలయంలో సీఎం స్టాలిన్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా ను అరికట్టడంలో ముఖ్యమంత్రి స్టాలిన్ గారు దేశానికి ఆదర్శంగా నిలిచారు అని చెప్పుకొచ్చాడు. మరియు తాను మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిపాడు. వడివేలు చివరగా విజయ్ హీరోగా నటించిన 'మెర్సల్' సినిమాలో తెలుగు ప్రేక్షకులకు కనిపించాడు. మరి ఇప్పుడు ఏ సినిమా తో రీ ఎంట్రీ  ఇస్తాడో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: