టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కెరీర్ ప్రారంభంలో చిన్న  క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వేస్తూ కాలం గడుపుతున్న  సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా  నటించిన 'సుస్వాగతం' సినిమాలో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా పెద్దగా ఆఫర్లు ఏమి రాకపోవడంతో రవితేజ హీరోగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆంజనేయులు' సినిమా తో ప్రొడ్యూసర్ గా మారాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా 'తీన్మార్' సినిమాను నిర్మించాడు. అది హిట్ కాకపోవడంతో పవన్ కళ్యాణ్ పిలిచి ఈ నిర్మాతకు మరొక అవకాశం ఇచ్చాడు అదే 'గబ్బర్ సింగ్' ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడం తో ఇండస్ట్రీ లో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు. ఈ హిట్ ఇచ్చిన ఊపుతో దాదాపు తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేశాడు. గత కొద్ది కాలంగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నా బండ్లగణేష్ మళ్ళీ తిరిగి ఒక సినిమాను నిర్మించే ఉద్దేశంతో ఉన్నట్లు కూడా ప్రకటించాడు. 

బండ్ల గణేష్ సినిమా ఫంక్షన్ల ద్వారా మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా జనాలకు దగ్గర గానే ఉంటాడు అని చెప్పవచ్చు. అందుకే బండ్ల గణేష్ ను చాలామంది నేరుగా సంప్రదించే బదులు సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా సంప్రదిస్తుంటారు. అందులో భాగంగానే ఒక వ్యక్తి సాయం కోరుతూ అన్న నమస్కారం 'మా అన్నయ్య' బండ్ల లింగయ్య కు ఆటో ప్రమాదంలో 48 కుట్లు పడ్డాయి. మరియు ఆరు నెలల పాటు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారు.
 వారు చాలా పేదవారు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు మీరు ఏమైనా సహాయం చేయగలరా, అని ఆ వ్యక్తి గణేష్ కి ట్వీట్ చేశాడు. వెంటనే స్పందించిన ఈ నిర్మాత మీ గూగుల్ పే నెంబర్ పంపండి మీకు డబ్బులు పంపిస్తాను. అని ట్విట్టర్ ద్వారా రిప్లై ఇచ్చాడు .ఇప్పుడు బండ్ల గణేష్ ఇచ్చిన రిప్లై నెట్టింట్లో వైరల్ గా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: