ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమ డైలమాలో ఉంది. సీన్ నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేయాలా లేదా ఓటీటీ లలో విడుదల చేయాలా అనే డైలమా లో ఉన్నారు. సురేష్ బాబు వంటి అగ్ర నిర్మాత తన సినిమాను డిజిటల్ గా విడుదల చేయడంతో కొందరు నిర్మాతలు తమ సినిమాలను ఏ విధంగా రిలీజ్ చేయాలో అన్న అయోమయం వ్యక్తపరుస్తున్నారు. చిన్న నిర్మాతలు చిన్న సినిమాలు మాత్రమే ఇప్పటివరకు డిజిటల్ గా రిలీజ్ కాగా ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా డిజిటల్ గా విడుదల కావడంతో రాబోయే సినిమాల పరిస్థితి ఏంటో అని సినిమా విశ్లేషకులు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కూడా తన తాజా చిత్రం పుష్పకవిమానం సినిమా ను ఈ తరహా లో విడుదల చేయాలన్న డైలమా లో ఉన్నాడు. తొలి సినిమా దొరసాని తో నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఆనంద్ దేవరకొండ రెండో సినిమా మిడిల్ క్లాస్ మెలోడీ తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇదే జోష్ లో మూడవ సినిమాను  దామోదర అనే నూతన దర్శకుడు తో చేశాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు సూపర్ హిట్ కాగా సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. 

ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తి చేసుకోని పోస్ట్ ప్రొడక్షన్ పనులను త్వరలోనే పూర్తి చేయనుంది. కాగా ఇప్పుడు పెద్ద సినిమాలు సైతం డిజిటల్ రిలీజ్ కే సిద్ధమవుతుండగా ఆనంద్ దేవరకొండ మాత్రం థియేటర్లలోనే పుష్పక విమానం సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నాడట. ఆయన గత చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాగా ఈ చిత్రం కూడా ఆ విధంగానే విడుదల అయితే తనపై ఓటీటీ ముద్ర పడే అవకాశం ఉండడంతో ఆనంద్ దేవరకొండ ఈ తరహ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: