టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ గురించి తెలియని వారు ఉండరు. సినిమా ఇండస్ట్రీలో మంచి మంచి సహాయక నటుల పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అజయ్ విక్రమార్కుడు సినిమాలో పోషించిన  విలన్ పాత్రకు విపరీతమైన పేరు వచ్చింది. అందులో టిక్కా పాత్ర ఎంత భయంకరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. విలన్ గా క్యారెక్టర్ లు మాత్రమే కాకుండా  మంచి మంచి పాత్రలతో ఎంతోమందిని ఏడిపించాడు. సహాయ నటుడిగా పెద్ద సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అజయ్.

పోకిరి సినిమాలో మహేష్ స్నేహితుడి గా అజయ్ నటనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. వెరైటీ వెరైటీ పాత్రలు చేయడంలో అజయ్ కి మించిన నటుడు లేడు. హీరోగా కూడా అజయ్ సారాయి వీర్రాజు అనే సినిమా చేశాడు అజయ్. కానీ అది అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఆ తర్వాత హీరోగా ప్రయత్నాలు చేయలేదు. నటుడు అవ్వాలనే ఫ్యాషన్ తో అజయ్ నటనలో శిక్షణ తీసుకుని కౌరవుడు అనే సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు. మొదట్లో అవకాశాలు రావడం ఇబ్బంది అయినా వెయిట్ చేశాడు.. అయితే 

 పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఖుషీ సినిమాలో కీలక పాత్రలో నటించాడు.ఆ తర్వాత ఇండస్ట్రీలో వెనుదిరిగి చూసుకోలేదు.  టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోల సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ ను సృష్టించుకున్నాడు. ఆయన సినిమా విషయాలు అందరికీ తెలిసినా వ్యక్తిగత జీవితంలో ఆయన గురించి ఎవరికీ తెలియదు. ఆయన భార్య పేరు శ్వేతా రావూరి. ఫ్యాషన్ డిజైనర్ గా శ్వేత అందాల పోటీలో ఫైనల్ పోటీదారు గా నిలిచారు.  ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారి పిల్లలతో అజయ్ శ్వేతా కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: