మా ఎన్నిక‌లు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధార‌ణ ఎన్నిక‌లు జ‌రిగితే రాజ‌కీయం ఎంత ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుందో ?  అంతే ర‌స‌వత్త‌ర రాజ‌కీయాన్ని త‌ల‌పిస్తున్నాయి. గ‌త నాలుగేళ్లు గానే మా లో వ‌ర్గాలు, గ్రూపులు.. చీలిక‌లు.. పీలిక‌లు వ‌చ్చేశాయి. జ‌య‌సుధ వ‌ర్సెస్ రాజేంద్ర ప్ర‌సాద్ ఎన్నిక జ‌రిగిన‌ప్పుడే మా లో ఉన్న గ్రూపులు ఏంటో బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. ఆ త‌ర్వాత శివాజీ రాజా వ‌ర్సెస్ న‌రేష్ మ‌ధ్య జ‌రిగిన ఎన్నిక‌లు కూడా మా ను బ‌జారుకు ఈడ్చేశాయి. ఇక తాజా మా ఎన్నిక‌లు కూడా ర‌చ్చ ర‌చ్చ‌గా మారిపోయాయి. ఇప్ప‌టికే ఐదుగురు మా ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్నామ‌ని చెప్పారు.

ఇక ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్‌, మంచు విష్ణు ప్యానెల్ ఇప్ప‌టికే పోటా పోటీగా ప్ర‌చారం ప్రారంభించేశాయి. తాజాగా విష్ణు ఓ టీవీ ఛాన‌ల్ ఇంటర్వ్యూ లో తీవ్ర వ్యాఖ్య‌లు చేసి క‌ల‌కలం రేపారు. జైలులో ఊచ‌లు లెక్క పెట్టే వాళ్లు కూడా నీతులు చెపుతున్నార‌ని ఫైర్ అయ్యాడు. ఈ వ్యాఖ్య‌లు ఎవ‌రిని ఉద్దేశించి అన్నారో తెలియ‌దు. అయితే ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కు లేకుండా పోయింద‌ని విష్ణు చెప్పారు. అయితే కొద్ది రోజులుగా ఇండ‌స్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి అన్నింటా తానై పెద్ద దిక్కుగా ఉంటున్నార‌న్న చ‌ర్చ అయితే ఉంది.

అయితే ఇప్పుడు ఇండ‌స్ట్రీకి పెద్ద లేర‌ని వ్యాఖ్యానించ‌డం మెగాస్టార్ ను... ఆయ‌న అభిమానుల‌ను కెలికిన‌ట్టే ఉంద‌ని అంటున్నారు. మ‌రి కొంద‌రు మాత్రం విష్ణు ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని అంటున్నారు. మ‌రి కొంద‌రు మాత్రం చిరు ప‌రోక్షంగా తెర వెన‌క ఉండి ప్ర‌కాష్ రాజ్‌కు స‌పోర్ట్ చేస్తున్నార‌ని.. అందు వ‌ల్లే చిరును టార్గెట్ చేసి ఈ మాట వ‌దిలి ఉంటాడ‌ని అంటున్నారు. ఏదేమైనా ఆ మ‌ధ్య త‌న క్యాంపెయిన్ ను చాలా ప‌ద్ధ‌తిగా.. ప‌రుష ప‌ద‌జాలం లేకుండా స్టార్ట్ చేసిన విష్ణు ఇప్పుడు గ‌ళం , స్వ‌రం పెంచుతోన్న ప‌రిస్థితి ?

మరింత సమాచారం తెలుసుకోండి: