దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియన్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇటీవల రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరిట మూవీ యూనిట్ విడుదల చేసిన వీడియో సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. కాగా, రాజమౌళి సినిమా అంటే చాలు దేశవ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. అయితే, తన సినిమాల ప్రమోషన్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించే రాజమౌళి ఆర్ఆర్ఆర్ కోసమై ఈ స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. అది ఫ్రెండ్‌షిప్ సాంగ్ అని తెలుస్తోంది. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేందుకే ఈ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారట. ఇందులో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో కలిసి ప్రభాస్, రానా దగ్గుబాటి, రవితేజ నటిస్తారని సమాచారం. ఈ ఒక్క పాట కోసమే దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వినికిడి. అదే జరిగితే టాలీవుడ్‌లో అత్యంత కాస్ట్లియెస్ట్ సాంగ్ ఆర్ఆర్ఆర్ ఫ్రెండ్‌షిప్ సాంగే అవుతుందని సినీ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సాంగ్‌లోనూ రామ్ చరణ్, ఎన్టీఆర్ గెటప్స్‌పై మూవీ యూనిట్ స్పెషల్ కేర్ తీసుకోబోతున్నది.

కొమురం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ తేజ్ ఇప్పటికే చిత్రంలో పాత్రలు పోషిస్తుండగా, వారిరువురు స్నేహితులుగా ఉన్నపుడు ఎలా ఉండబోతుందనేది పాటలో చూపిస్తారేమోనని పలువురు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా రామరాజు, కొమురం భీం గెటప్స్‌లో చెర్రీ, తారక్ అదరగొట్టడం ఖాయమని ఇద్దరు హీరోల అభిమానులు అంటున్నారు.

దసరా కానుకగా అక్టోబర్ 13న సినిమా విడుదల కాబోతుండగా, అంతకంటే ముందు ఈ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసే చాన్సెస్ ఉంటాయి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో పాన్ ఇండియా చిత్రం చేస్తుండగా, రామ్ చరణ్ తేజ్ శంకర్‌తో పాన్ ఇండియా మూవీ చేస్తుండటం విశేషం. అయితే, రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’లోనూ ‘సిద్ధ’అనే ఫుల్ లెంథ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఆ షూటింగ్ కూడా ఇటీవల ప్రారంభమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: