టాలీవుడ్ సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పూజా రామచంద్రన్ కు మంచి క్రేజ్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న తర్వాత ఆమె మరిన్ని సినిమా అవకాశాలను అందుకుని ప్రేక్షకులను తన సినిమాల ద్వారా అందచందాలతో అలరించింది.  సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫోటోలతో హాట్ హాట్ పిక్స్ తో అందరినీ ఎంతగానో అలరిస్తుంది. తమిళ మలయాళ చిత్రాల్లో నటించిన పూజా రామచంద్రన్ తెలుగులో స్వామి రారా సినిమా లో నిఖిల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడంతో మంచి గుర్తింపు దక్కించుకుంది.

ఆ తరువాత త్రిపుర , కృష్ణార్జున యుద్ధం, దేవిశ్రీప్రసాద్, ఎంత మంచి వాడవురా సినిమా లతో హీరోయిన్ రేంజ్ లో ఆమె గుర్తింపు దక్కించుకుని వరుస సినిమా అవకాశాలను కొట్టేసింది. ఆమె నటనకు ఆమె అందాలకు ఫిదా అయిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆమెకు అభిమానిగా మారిపోగా ఆమెను ఫాలో అవ్వడం మొదలు పెట్టారు. మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నటిగా మంచి ఫామ్ లో ఉంది.  2010లో ఈమె వివాహం చేసుకోగా 2017 లో అతనితో విడిపోయి మరొక మోడల్ అయినా జాన్ ను పెళ్లి చేసుకుంది.

ఇటీవలే ఆమె జాన్ తో కలిసి దిగిన ఎన్నో ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ గా మారాయి. మొదటినుంచి గ్లామర్ షో చేయడంలో ఈమె ఏమాత్రం వెనక్కి రాలేదు. తనకే సొంతమైన అందాలతో తెలుగు ప్రేక్షకులను తన బికినీ ఫోటో షూట్ లతో అలరిస్తూ వచ్చింది. లవ్ ఫెయిల్యూర్ సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె ఆ తరువాత ఎన్నో సినిమాల్లో నటించింది. సినిమా స్క్రీన్ పై ఏమైనా చూసిన ప్రతి ఒక్కరూ ఆమె వయస్సు ఇరవై లలో మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు కానీ ఆమె వయస్సు 38 సంవత్సరాలు అని ఎవరూ అనుకోరు. ఏదేమైనా 38 సంవత్సరాల వయసులో నూ ఇంత అందాన్ని మెయింటైన్ చేస్తూ అందరిని అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: