
సినిమా పరిశ్రమలో రాణించడం అంటే ఎంతో లక్ ఉండాలి. ముఖ్యంగా నిర్మాతగా రాణించడం అంటే పెద్ద అదృష్టమే ఆయనకు ఉండాలి. ఎంతో అనుభవం మెళకువలు తెలిసి ఉంటే గాని సినిమా ఇండస్ట్రీ లో నిర్మాతగా రాణించడం కష్టం. ఎక్కడ బడ్జెట్ ను పెట్టాలి ఎక్కడ బడ్జెట్ ను తగ్గించాలి అనే విషయాలు స్పష్టంగా తెలిసి ఉండాలి. ఆ విధంగా కొన్ని కొన్ని సార్లు స్టార్ హీరోలతో చేసిన సినిమాలు నష్టాన్ని కలిగిస్తే కొత్త హీరోలతో చేసిన సినిమాలు భారీ లాభాలను తెచ్చి పెడతాయి సదరు నిర్మాతలకు. అలా చిన్న సినిమాలతో భారీ లాభాలను అందుకున్న నిర్మాతలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీత గోవిందం సినిమా గీతా ఆర్ట్స్ సంస్థ పై అల్లు అరవింద్ నిర్మించగా 15 కోట్ల ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా 70 కోట్ల రూపాయలను వసూలు చేసింది. మెగా హీరో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా సినిమా 48 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మొత్తం మీద 25 కోట్ల రూపాయల లాభాలను తీసుకువచ్చింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన భలే భలే మగాడివోయ్ సినిమా 25 కోట్ల పైగానే వసూలు చేసి గీత ఆర్ట్స్ సంస్థకు భారీ లాభాల్ని తీసుకువచ్చింది.
అలాగే విజయ్ దేవరకొండ ను స్టార్ హీరోను చేసిన అర్జున్ రెడ్డి సినిమా 5 కోట్లతో తెరకెక్కి 25 కోట్ల రూపాయలను వసూలు చేసి భారీ రేంజ్ లో హిట్ అయ్యింది. నాగచైతన్య సమంత కలిసి నటించిన మజిలీ సినిమా 39 కోట్ల రూపాయలను వసూలు చేసి 19 కోట్ల లాభాలను తెచ్చింది. నాగచైతన్య కెరీర్లోనే ఓ సినిమాకు ఇంత లాభం రావడం ఇదే తొలిసారి. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన అ ఆ సినిమా కూడా 20 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది. అయితే పెద్ద హీరోల సినిమాలతో ఇంతటి లాభాన్ని చూసి ఉండరు మన నిర్మాతలు.