ప్రేక్షకులకు ఎంటర్‌టైన్మెంట్ అందించే సినిమాలు ఒక్కోసారి క్లైమాక్స్ కారణంగా ఫ్లాప్ అవుతుండటం మనం గమనించొచ్చు. సినిమా టైటిల్ నుంచి మొదలుకుని ప్రతీ సీన్ ఎక్సలెంట్‌గా ఉన్నప్పటికీ క్లైమాక్స్ సరిగా లేకపోతే చిత్రం విజయం సాధించే అవకాశాలు తక్కువేనని సినీ పరిశీలకులు, విశ్లేషకులు చెప్తుంటారు. అలా క్లైమాక్స్ పట్ల డైరెక్టర్స్ శ్రద్ధ వహించకపోవడంతో సినిమా మొదటికి మోసం అవుతుంది. ఈ క్రమంలో తెలుగులో పలు సినిమాలు క్లైమాక్స్ వల్ల అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఆ సినిమాల్లో కొన్నిటినీ ఈ స్టోరీ చదివి తెలుసుకుందాం.

సినీ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం..ముఖ్యంగా తెలుగు సినిమాలకు క్లైమాక్స్ వెరీ ఇంపార్టెంట్ అనేది ఓ ఫార్ములా అనే చెప్పొచ్చు. గత సినిమాల అనుభవాలను గుర్తుపెట్టుకునే ఈ రూల్ వర్తిస్తుంది. ఇప్పటి వరకు విడుదలైన సినిమాల్లో కొన్ని వీక్ క్లైమాక్స్ వల్ల డిజాస్టర్‌గా మిగిలిపోయాయి. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘శీను’ ఫిల్మ్ ప్రతీ ఫ్రేమ్ అద్భుతంగా ఉండటంతో పాటు అందులోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ, క్లైమాక్స్ విషయంలోనే చిన్న మిస్టేక్ జరిగిందని పలువురు అభిప్రాయపడుతుండటం మనం చూడొచ్చు. హీరోయిన్ ట్వింకిల్ ఖన్నాకు ముగవాడిగా పరిచయమైన వెంకటేశ్ చివర్లో మూగవాడిగా మారడాన్ని ప్రేక్షకులకు జీర్ణించుకోలేకపోయారు.


 

అలా చేయకుండా ఉంటే బాగుండేదని ఇప్పటికీ ఉన్న అభిప్రాయం. ఇక తెలుగు ప్రజలు సినిమా చివర్లో హీరో చనిపోతే ఒప్పుకోరనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ, దర్శకులు ఈ విషయమై ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన ‘చక్రం’లో హీరో ప్రభాస్ మరణం చర్చనీయాంశమే. ఆ సీన్ వల్లే సినిమా ఆడలేకపోయిందని పలువురి అభిప్రాయం. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘నక్షత్రం’ సినిమాలోనూ హీరో సాయిధరమ్ తేజ్ మరణించడం సరికాదని, అలా కాకుండా వేరే రకంగా సీన్ రాసుకుంటే బాగుండేదని టాక్ వచ్చింది. జాగర్లమూడి క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన ‘వేదం’ చిత్రంలోనూ మంచు మనోజ్ చనిపోవడం సరికాదని, క్లైమాక్స్ మార్చి ఉంటే బాగుండేదన్న టాక్ వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో సరిసమానంగా మనోజ్ పాత్ర ఉందనే కామెంట్స్ కూడా వినిపించాయి.
 

ఈ కోవకే చెందిన చిత్రం ‘భీమిలి కబడ్డి జట్టు’. ఓపెనింగ్ సీన్ నుంచి మొదలుకుని క్లైమాక్స్ వరకు సినిమా అత్యద్భుతంగా ఉన్నప్పటికీ చివర్లో హీరో నాని మరణించడం ప్రేక్షకులకు నచ్చలేదు. నాని చనిపోవడం వల్లే సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదనేది జనాల టాక్. ప్రభుదేవా, అరవిందస్వామి, కాజోల్ కాంబోలో వచ్చిన ‘మెరుపు కలలు’ చిత్రం కూడా క్లైమాక్స్ విషయమై ప్రేక్షకుల ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ కాలేదు. చివరి క్షణంలో అరవింద స్వామి చర్చ్ ఫాదర్‌లా మారడం ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదట. మొత్తంగా అంతాబాగున్న చివర్లో దెబ్బ పడుతున్నదన్నట్లు క్లైమాక్స్ సరిగా లేకపోతే సినిమాలు ఆడబోవని సినీ ప్రేక్షకులు  చెప్పకనే చెప్తున్నట్లుగా భావించాలి మేకర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: