జేడీ.చక్రవర్తి.. శివ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ఆ తర్వాత తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చక్రవర్తి మిగతా హీరోల లాగ కాదు. కొంచెం స్ట్రెయిట్ ఫార్వర్డ్. మంచి అనిపిస్తే మంచి అనడం లేదా చెడు అనిపిస్తే వెంటనే తిట్టడం లేదా కొట్టడం లాంటివి చేస్తూ ఉండేవాడట. కానీ ఎవరి మీద తన కోపాన్ని కానీ ,భావోద్వేగాలను కాని, ద్వేషాన్ని కానీ  పెంచుకుని వారిపై రివేంజ్ తీర్చుకొనే మనస్తత్వం కాదు. కానీ కొంతమంది మాత్రం జె.డి.చక్రవర్తి చాలా అరాచకుడు అని, ఒక రౌడీ అని తిట్టుకుంటూ ఉండేవారు. కొంతమందేమో జె.డి.చక్రవర్తి చాలా మంచివాడని అందరిని ఆదుకుంటాడు అని మంచి మార్క్ కూడా ఉండేది.

ఇకపోతే జె.డి.చక్రవర్తి తెలుగు సినిమాలకు మాత్రమే కాదు బాలీవుడ్ సినిమాల్లో కూడా పాపులర్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు  అంతే కాదు ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు కూడా మంచి హిట్ అయ్యాయి. ఇక ఈయన  అసలు పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. వీరిది హైదరాబాదు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉండేవారు. ఇక తన విద్యాభ్యాసం మొత్తం హైదరాబాదులో ఉన్న సెయింట్ జార్జ్ గ్రామర్ పాఠశాలలో పూర్తిచేసుకున్నాడు. ఇక ఉన్నత విద్య కోసం చైతన్య భారతి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.

ముఖ్యంగా జె డి చక్రవర్తి కి కూడా ఒక స్నేహితుల గ్యాంగ్ ఉండేది. ఎక్కడైనా ఏదైనా గొడవ జరుగుతుంది అంటే చాలు ..చటుక్కున వాలిపోయాడు. చూడడానికి కొంచెం రౌడీ లాగా కనిపించే వాడు. ఇక ఈ రౌడీయిజమే రామ్ గోపాల్ వర్మ ను కట్టిపడేసేలా చేసింది. అలా  మొదటిసారి శివ సినిమాలో అవకాశం ఇచ్చాడు. అలా మంచి మంచి పాత్రలు చేస్తూ దర్శకత్వం వహిస్తూ, మంచి గుర్తింపు తెచ్చుకున్న జె.డి.చక్రవర్తి ,ఎంత కష్టపడి సినిమాలు తీసి డబ్బు సంపాదించుకున్నాడో, అంతే త్వరగా ఇతర అలవాట్లతో డబ్బులు మొత్తం  పోగొట్టుకున్నాడు. అయితే ఈ డబ్బు పోగొట్టుకునే అలవాటును ఎంత మానుకోవాలని ప్రయత్నించినప్పటికీ, మానుకోలేకపోతున్నాను అని.. ఈ తప్పును ఎప్పుడు సర్దుకుంటానో అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: