పోర్న్ స్టార్స్ కు కూడా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. వాళ్లకు హీరోయిన్ల కన్నా ఎక్కువ క్రేజ్ ఉంటుంది. వాళ్లు పోర్న్ వదిలేసినా సరే ఆ క్రేజ్ కంటిన్యూ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయమై ఎప్పుడు ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. అలాంటి స్టార్ స్టేటస్ అందుకున్న పోర్న్ బ్యూటీస్ కొంతకాలం తర్వాత ఆ వృత్తిని వదిలేసి పెళ్లి చేసుకుని స్థిరపడుతున్నారు. అయితే కొందరు మాత్రమే ఆ బంధాన్ని చిరకాలం నిలబెట్టుకోగలుగుతున్నారు. దానికి నిదర్శనం సన్నీ లియోన్. నీలి చిత్రాలు వదిలేసి బాలీవుడ్ హీరోయిన్ గా స్థిరపడిన సన్నీ ఇప్పుడు ఎలాంటి చీకూచింతా లేకుండా కుటుంబంతో చాలా సంతోషంగా కనిపిస్తోంది. పోర్న్ లా కాకపోయినా అదే రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అలరిస్తోంది.
 
మరో మాజీ పోర్న్ స్టార్ మియా కలీఫా పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఫేమస్ పోర్న్ స్టార్ మియా ఇప్పటికే రెండు వివాహాలు చేసుకుంది. ప్రస్తుతం రెండవ భర్త రాబర్ట్ శాండ్ బర్గ్ తో కలిసి ఉంటుంది. కానీ ఆయన కూడా మియా కలీఫాకు షాకిచ్చాడు. భర్తతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. విడాకుల గురించి ఆమె మాట్లాడుతూ "గత సంవత్సర కాలంగా మా వివాహాన్ని కొనసాగించడానికి మేము చాలా ప్రయత్నాలు చేసాము. వైవాహిక సంబంధాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. మా మధ్య స్నేహం ఎప్పటికీ కొనసాగుతోంది. ఇది చాలా కష్టమైన నిర్ణయం. కానీ వేరే మార్గం లేదు. ఫేక్ రిలేషన్ కొనసాగించలేము" అంటూ ఎమోషనల్ అయ్యింది. మియా కలీఫా రెండో వివాహం కేవలం సంవత్సరంలోనే ముగిసిపోవడం ఆమె అభిమానులకు బాధ కలిగిస్తోంది. ఇప్పుడు ఈ బ్యూటీ పరిస్థితి ఎంటా అనే చర్చ మొదలైంది. మూడో వివాహానికి సిద్ధ పడుతుందా? లేదంటే మళ్లీ పోర్న్ వైపు దృష్టి సారిస్తుందా? అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: