
టాలీవుడ్ సినీ పరిశ్రమలో స్నేహానికి మంచి విలువ ఇస్తారు నటీనటులు సాంకేతిక నిపుణులు. ఏ విభాగానికి చెందిన వారితో అయినా ఎంతో స్నేహంగా మెడుగుతు స్నేహబంధాన్ని కొనసాగిస్తారు. ఆ విధంగా టాలీవుడ్ లో స్నేహానికి గుర్తుగా నిలుస్తున్నారు దర్శకుడు త్రివిక్రమ్ , కథానాయకుడు పవన్ కళ్యాణ్. టాలీవుడ్ సినీ పరిశ్రమలో వీరిద్దరి స్నేహం సాటిరానిది. ఎందుకంటే గతంలో ఏ ఇద్దరు స్నేహితులు కూడా ఉండని విధంగా మంచి అనుబంధంతో మెలుగుతారు. జల్సా సినిమాతో మొదలైన వీరిద్దరి స్నేహం ఇప్పటి వరకు కొనసాగుతూ అలుపెరగకుండా దూసుకుపోతూనే ఉంది.
సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా వారి మధ్య స్నేహబంధం మాత్రం ఎవర్ గ్రీన్ గా నిలుస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా త్రివిక్రమ్ దగ్గర నుంచి మంచి సపోర్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ కు తగ్గ కదా ఏదైనా తన వద్దకు వస్తే వెంటనే ఆ కథను పవన్ కళ్యాణ్ కి పంపించి ఈ సినిమా చేస్తే బాగుంటుందని చెప్పి ఆ సినిమా చేసే విధంగా ఆయనను ప్రోత్సహిస్తూ ఉంటాడు త్రివిక్రమ్. ఆ విధంగా ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ సినిమా రీమేక్ ను పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సిఫారసు మీదనే చేస్తున్నాడు.
అంతేకాదు సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగత అంశాలలోనూ ఒకరికొకరు తోడుగా నిలుస్తూ సలహాలు తీసుకుంటారట. వీరి కాంబినేషన్లో ఇప్పటి వరకు మూడు సినిమాలు రాగా అజ్ఞాతవాసి సినిమా వారిద్దరికీ చేదు అనుభవాన్ని మిగిల్చింది. అత్తారింటికి దారేది ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు సృష్టించగా జల్సా సినిమా సూపర్ హిట్ గా నిలిచి ఇద్దరికీ హిట్ పెయిర్ పేరు తీసుకువచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏకే రీమేక్ కు కూడా త్రివిక్రమ్ సంభాషణలు అందిస్తుండటం విశేషం. ఇదంతా పవన్ కళ్యాణ్ మైత్రి వల్లనే సాధ్యమైంది అని చెప్పవచ్చు. ఏదేమైనా తెలుగు సినిమా పరిశ్రమలో ఇంతవరకు చూడని స్నేహబంధం వీరి మధ్య కొనసాగుతోంది.