మోహన్ బాబు అసిస్టెంట్ దర్శకుడి నుంచి విలన్ గా మారారు. విలన్ గా ఆయన చెప్పే విలక్షణమైన డైలాగులు కు మంచి క్రేజ్ ఉండేది. దీంతో ఆయనకు కెరీర్ ఆరంభంలో విలన్ పాత్రలే ఎక్కువగా వచ్చాయి. సబ్ విలన్ నుంచి ఆయన రెండో విలన్‌గా ఎదిగారు. ఆ తర్వాత మోహన్ బాబు హీరోగా మారారు. అయితే అప్పటి వరకు విలన్ గా నటించిన ఆయన పక్కన హీరోయిన్ పాత్రలో నటించేందుకు ఎవరు ముందుకు వచ్చేవారు కాదట. అప్పట్లో హీరోయిన్ గా దూసుకుపోతున్న కవితను మోహన్ బాబు పక్కన హీరోయిన్‌గా నటించమని అడిగితే ఈ విలన్ పక్కన నేను హీరోయిన్ గా నటించాలా ? అని ప్రశ్నించిందట కవిత.
అయితే ఎలాగోలా చివరకు ఆమెను ఒప్పించారు. ఆ సినిమా హిట్ అయ్యాక మోహన్‌బాబు - కవిత కాంబినేషన్లో నాలుగైదు సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత కవిత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సుదీర్ఘకాలం ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. ఇటీవల కవిత భర్త, కుమారుడు పది రోజుల వ్యవధిలో కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి