వాస్తవంగా చెప్పాలంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి హిట్ సినిమా ఇచ్చిన శ్రీకాంత్ శ్రీమంతుడు షూటింగ్ జరుగుతూ ఉండగా సెట్లోనే మహేష్‌ను కలిశాడట. ఒక ఫ్యామిలీ కథ సీతమ్మ వాకిట్లో స్టోరీ లా ఉంటుంది అని చెప్పిన వెంటనే మహేష్ పూర్తిగా కథ వినకుండానే ఓకే చెప్పేశాడట. తీరా చూస్తే ఈ సినిమా షూటింగ్ సగం పూర్తయ్యాక కానీ అసలు కథ రెడీ కాలేదన్న విషయం మహేష్‌కు తెలియ లేదట. శ్రీకాంత్ ఏ సీన్ ఎటు తీస్తున్నాడో కూడా ఎవ్వరికి అర్థం కాలేదట.
శ్రీకాంత్ అడ్డాల పూర్తి కథ రెడీ చేసుకోకుండానే మహేష్ ను నమ్మించి సినిమాను ఓకే చేయించుకున్నాడు. సినిమా సగం అయిన వెంటనే సినిమా ఫలితం ఎలా ఉంటుందో మహేష్‌కు క్లారిటీ వచ్చేసిందట. దాంతో కేకలు వేసిన మహేష్ సెట్స్ నుంచి వెళ్లిపోయాడట. తర్వాత పదిహేను రోజులు షూటింగ్‌కు విరామం ఇచ్చి శ్రీకాంత్ ను పూర్తి కథ రెడీ చేయమని సూచించాడట. అయితే మహేష్ ఊహించినట్టుగానే బ్రహ్మోత్సవం ఘోరమైన ప్లాప్ అవడంతో పాటు మహేష్ పరువు తీసేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి