స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ బాల నటిగా తెరంగేట్రం చేస్తున్న సంగతి మ‌న‌కు తెలిసిందే. ఇండస్ట్రీలో ఎందరినో బాలనటులను సీనియర్ దర్శకులు గుణశేఖర్ ప‌రిచ‌యం చేశారు. అయితే అర్హను కూడా గుణ‌శేఖ‌ర్ ఇండ‌స్ట్రీకి పరిచయం చేస్తున్నారు. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శాకుంతలం చిత్రంలో అర్హ బాలనటిగా న‌టిస్తోంది.


ఇప్పటికే అర్హ పై షూటింగ్ పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. వారం క్రితం శాకుంతలం చిత్ర బృందం సెట్లు, బెలూన్లతో ఘనస్వాగతం పలికింది. తొలిరోజు చిత్రీకరణకు అర్జున్ -స్నేహ సైతం వచ్చారు. అక్కడ అల్లు అర్జున్ అర్హ కోసం `ఫాల్కన్ బస్`ను ఏర్పాటు చేయ‌డంతో ఇండ‌స్ట్రీ అంద‌రిలో చర్చ మొద‌లైంది.అర్హ‌పై షూటింగ్‌ను వారం రోజుల్లోనే పూర్తి చేశారు గుణశేఖ‌ర్‌. అయితే వీడ్కోలు పలికే స‌మ‌యాన్ని కూడా స్వాగతం ప‌లికిన విధంగానే ఏర్పాటు చేసింది. బెలూన్లు, సెట్ మ‌ధ్య‌ అర్హ కేక్‌ను క‌ట్ చేసింది. చివ‌రి రోజు కావ‌డంతో అల్లు అర్జున్, స్నేహ కూడా వ‌చ్చారు. అయితే ఫోటోల‌లో అర్జున్‌, స్నేహ‌ ఆనందం కుటుంబంలో స్పష్ఠంగా కనిపిస్తోంది. అల్ల అర్జున్ కొడుకు కంటే ముందే కూతురునే ఇండస్ట్రీకి ప‌రిచ‌యం చేస్తున్నాడు.


 
శాకుంతలంలో అర్హ నటిస్తోందనగానే బన్ని అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయింది. అయితే అభిమానులు తనని పెద్ద తెరపై చూడాలని ఎంతో ఆత్రుత‌తో ఎదురుచూస్తున్నారు. సమంత లీడ్ రోల్‌లో న‌టిస్తున్న ఈ చిత్రంలో అర్హ పాత్ర ఎలా ఉంటుంద‌నేది అంద‌రిలో ఆస‌క్తి మొద‌లైంది. అయితే క‌థ విష‌యానికి వ‌స్తే.. పురు రాజవంశం రాజు దుష్యంతుల జీవితం ఆధారంగా రూపొందుతున్న పౌరాణిక చిత్రం. సమంతతో పాటు మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్టంతగా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించ‌గా, శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రఫీగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే ఇందులో అర్హ పాత్ర చిన్ప‌ప్ప‌టి స‌మంత‌గా చూపిస్తార‌ని సినీ ఇండ‌స్ట్రీలో చ‌ర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: