తెలుగు
సినిమా నటుడు
రాజ్యసభ సభ్యుడు రావుగోపాలరావు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన నట జీవితం ముత్యాలముగ్గు సినిమాలోని కాంట్రాక్టర్ వేషం తో గొప్ప మలుపు తిరిగింది. అప్పట్లో ఈ చిత్రంలో ఆయన పలికిన డైలాగులు ఇప్పటికీ ప్రేక్షకులు వింటూ ఆనంద పడిపోతుంటారు.
ఆడియో క్యాసెట్ల రూపంలో రికార్డుల రూపంలో ఆ డైలాగులు ఉండేవి. పాటలు మాత్రమే కాదు మాటలు కూడా ఈ రేంజ్ లో అమ్ముడు అవుతాయని రావు గోపాలరావు నిరూపించాడు. పెద్ద పెద్ద హీరోలు సైతం అయన డేట్స్ కోసం ఎంతగానో వేచి చూసేవారు. తమ సినిమాలో ఒక్క వేశామైనా అయన వేయాలని చెప్పేవారు. విలన్ గానే కాకుండా అన్ని పాత్రలలో రావు గోపాల్ రావు నటించి ప్రేక్షకులను అలరించారు.
తెలుగు
సినిమా విలనిజాన్ని కొత్త రూపు తీసుకొచ్చి రావు గోపాలరావు సరికొత్త రూపం ఇచ్చారు. తనకే సాధ్యమైన డైలాగ్ మాడ్యులేషన్ తో నటనతో స్టార్ హీరోల క్రేజ్ లో
మార్కెట్ ను సంపాదించుకున్నాడు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసి వారి హృదయాలను కొల్లగొట్టాడు. రంగస్థల నటుడు గా ఎన్నో పాత్రలు చేసి మంచి అనుభవాన్ని గడించి
సినిమా ల్లోకి వచ్చి కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్నాడు. కాగా నేడు ఆయన వర్ధంతి.
1990వ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఆయనకు ఆయనకు ఇద్దరు కుమారులు కాగా ఒక కుమార్తె. కుమారుడు
రావు రమేష్ కూడా తండ్రికి తగ్గ నటుడిగా
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఎంత చెప్పినా రావుగోపాలరావు గురించి తక్కువ అవుతుంది. ఆయన నటనను మరచిపోలేము. ఇప్పటి ప్రతి ఒక్క నటుడు ఆయనను అనుసరించి ముఖ్యంగా ప్రతినాయకుడి పాత్రలో ఎవరిని ఆయనను గుర్తు చేయలేకపోయారు. తెలుగు నటీనటులతో నిజం గా రావు గోపాలరావు లేని లోటు తప్పకుండా కనిపిస్తుంది. అంత గొప్ప నటుడిని ఓ సారి గుర్తు చేసుకుందాం.