‘రూలర్’ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు చివరగా కనిపించిన నందమూరి నటసింహం బాలయ్య ఆ తర్వాత నటించిన సినిమాలు కొవిడ్ వల్ల విడుదల కాలేదు. ఇక అంతకు ముందు నటించిన చిత్రాలు ‘ఎన్టీఆర్:కథానాయకుడు, మహానాయకుడు’ కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ క్రమంలోనే యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో హ్యాట్రిక్ ఫిల్మ్ చేస్తున్నారు బాలకృష్ణ. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘సింహా, లెజెండ్’ చిత్రాలు సూపర్ హిట్స్ కాగా, ప్రస్తుతం ‘అఖండ’ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీలో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్ రోల్ ప్లే చేస్తుండగా, బాలయ్య డబుల్ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రగ్యాజైశ్వాల్ నటిస్తోంది. ఈ చిత్రషూటింగ్ తాజాగా పూర్తి అయినట్లు సమాచారం.
దసరా కానుకగా అక్టోబర్ నెలలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే, అదే సమయానికి అనగా అక్టోబర్ 13న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కూడా విడుదల కాబోతున్నదన్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా విడుదల మళ్లీ పోస్ట్ పోన్ అవుతోందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య ‘అఖండ’ చిత్రం అక్కినేని అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఫిల్మ్, మెగా హీరో వైష్ణవ్ తేజ్- క్రిష్ కాంబోలో వస్తున్న మూవీతో పోటీ పడాల్సి వస్తుంది.
అయితే, ఈ హీరోలు బాలయ్యకు పోటీ ఇస్తారో లేడో చూడాలి మరి.. కాగా, ఈ చిత్రాల విడుదలకు సంబంధించిన ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. ‘బొమ్మరిల్లు’ ఫేమ్ డైరెక్టర్ భాస్కర్ డైరెక్షన్‌లో వస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’సినిమాలో అక్కినేని అఖిల్‌కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఇక డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రంలో ‘ఉప్పెన’ ఫేమ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్నారు. ఈ సినిమా ఓ నవల ఆధారంగా తెరకెక్కగా, వైష్ణవ్ సరసన హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి