ఈ సినిమా ఆగస్టు 27వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని 'కింగ్' నాగార్జున విడుదల చేశారని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా లో హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాన్స్ సీన్స్ ట్విస్టులు ప్రేక్షుకులని మెప్పిస్తాయట. చివర్లో 'వాళ్లు హోల్‌సేల్‌గా లేపేసే బ్యాచ్‌రా 'అంటూ సుశాంత్ చెప్పే డైలాగ్‌తో ఈ ట్రైలర్ ముగుస్తుందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే హీరో సుశాంత తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడని తెలుస్తుంది. ఆ ఇంటర్వ్యూ లో సుశాంత్ ఈ సినిమాకి సంబందించిన విషయాలని పంచుకున్నాడట. ఆ తర్వాత యాంకర్ ప్రతీ సారి అక్కినేని ఫ్యామిలీ నుండి బిగ్ బాస్ కి ఎవరైనా స్పెషల్ గా వస్తారు కదా.. ఈసారి మీరు వచ్చే అవకాశం వుందా అని అడిగారట. దానితో సుశాంత్ నవ్వుతూ చూడాలి మరి అన్నాడట.దానితో యాంకర్ ఈ బిగ్ బాస్ కి మీరు వస్తారేమో అనుకున్నానని అన్నారట. దానికి కూడా చూడాలి అండి అంటూ మళ్ళీ నవ్వాడట సుశాంత్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి