జబర్దస్త్ లో టీం లీడర్ గా కొనసాగుతున్న సమయంలోనే సుడిగాలి సుదీర్ ఏకంగా ఈటీవీలో పోవే పోరా అనే కార్యక్రమానికి యాంకరింగ్ చేయడం మొదలుపెట్టాడు. అప్పటివరకు బుల్లి తెరకు పరిచయం లేని విష్ణుప్రియ తో కలిసి ఇక సుడిగాలి సుధీర్ యాంకరింగ్ చేయడంతో విష్ణు ప్రియకి కూడా ఎంతగానో క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఇక వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అయ్యింది. అంతేకాకుండా ఒకరిపై ఒకరు  పంచులు వేసుకుంటూ అటు బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎంతగానో ఎంటర్టైన్మెంట్ పంచారు. ఇక ప్రతి వారం కూడా సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.


 ఇలా ఇక తక్కువ సమయంలోనే పోవే పోరా అనే కార్యక్రమం ఎక్కువ పాపులారిటీ సంపాదించింది. బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించింది. ఇక ఆ తర్వాత కరోనా వైరస్ టైంలో ఒక్కసారిగా పోవే పోరా కార్యక్రమాన్ని ఆపేశారు. దీంతో ఎంతో మంది అభిమానులు హర్ట్ అయ్యారు.  ఇక ఇప్పుడు మళ్లీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఈ ప్రోమో లో భాగంగా మరో సారి విష్ణు ప్రియ సుడిగాలి సుదీర్ ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటూ రచ్చ చేయడం మొదలుపెట్టారు.



 టిప్పర్ లారీ కి బస్సు కి మధ్యలో పడిపోయి గుద్దుకు పోతే ఎలా ఉంటుందో అలా అయిపోయింది నీ మొఖం అంటూ సుడిగాలి సుధీర్ విష్ణు ప్రియ పై పంచ్ వేస్తాడు. దీంతో అందరూ నవ్వుకుంటారు. నన్ను అంత మాట అంటావా.. నువ్వు ఎలా ఉన్నావో తెలుసా మా అమ్మ గుత్తి వంకాయ కూర వండుతూ వండుతూ ఇక అందులో ఒక వంకాయ బాగా మాడిపోయినట్టుంది అని బయటికి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నీ మొఖం అంటూ సుడిగాలి సుదీర్ పైన దారుణమైన కామెంట్ చేస్తుంది విష్ణుప్రియ. దీంతో ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతారు. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అవసరం లేదు అంటూ ఇక సుడిగాలి సుదీర్ చెప్పడంతో అక్కడున్న వారందరూ విజిల్స్ వేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: