మన తెలుగులో మాస్ హీరోలలో ఒకరైన గోపిచంద్ కి ఒకప్పుడు మంచి సూపర్ హిట్స్ పడ్డాయి. అయితే ఆయన సినిమాల సెలక్షన్ వలన ఈమధ్య వరసగా ప్లాప్స్ రావడం మొదలయ్యాయి. ఆయన హీరోగా సూపర్ హిట్ కొట్టిన చివరి చిత్రం లౌక్యం. ఇది 2015 లో వచ్చింది ఇక అప్పటినుంచి గోపిచంద్ కి ఒక్క హిట్ రాలేదు. అయితే ఈ మద్యనే విడుదలైన సీటిమార్ సినిమాకి మొదటి రోజు మంచి టాక్ వచ్చింది . హమ్మయ్య గోపిచంద్ కి ఒక హిట్ వచ్చింది అని ఫాన్స్ అంత అనుకున్నారు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు ఉండలేదు. 

సినిమా వినాయక చవితి ఊపులో బాగానే కలెక్షన్స్ కొట్టిన ఆ తర్వాత మెల్లగా బాక్స్ ఆఫీస్ దగ్గర చల్లబడింది. మొదటి వారం సీటిమార్ కలెక్షన్స్ దాదాపుగా 8 కోట్లు వచ్చాయి. అయితే  సినిమా హిట్ అవ్వాలి అంటే మాత్రం 13 కోట్లు కొల్లగొట్టాలి. సినిమా ప్రస్తుత పెరఫార్మెన్స్ చూస్తే మాత్రం అది జరగడం చాలా కష్టం గానే కనిపిస్తుంది. ఎందుకంటే జనాలు ఇంకా అంతగా థియేటర్స్ కి అలవాటు కాలేదు. అలాగే ఓటీటీలో టికెట్ రేట్ కి కొన్ని వందల సినిమాలని ఇంట్లో కూర్చొనే చూసుకునే అవకాశం ఉంది.ఇలాంటి పరిస్థితుల్లో సినిమా హిట్ అవ్వాలి అంటే కంటెంట్ చాలా బాగుంటే తప్ప కుదరదు.

అలాంటిది సీటిమార్ లో పక్క మాస్ మసాలా ఎలెమెంట్స్ పెట్టారు గాని కథ అంత బలంగా లేదు. ఆడపిల్లల కబడ్డీ కి హీరో ఏలేవేషన్స్ సరిగ్గా సరిపోలేదు. సినిమాకి పండగ రోజు కలిసివచ్చి ఆ మాత్రం కలెక్షన్స్ అయిన వచ్చాయి. అయితే ఇది ఇంకా మొదటివారమే కాబట్టి బహుశా రెండివారంలోపు మొత్తం పెట్టిన డబ్బులని తీసుకొస్తుందేమో అని డిస్ట్రిబ్యూటర్స్ ఎదురుచూస్తున్నారు. కానీ అది ప్రస్తుతం విడుదలైన సినిమాలని చూస్తుంటే వర్కౌట్ అయ్యేలా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: