భారతీయ చలనచిత్ర పరిశ్రమలో గాయకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు కె జె ఏసుదాస్. బాలసుబ్రమణ్యం కు పోటీగా ఎన్నో చిత్రాల్లో ఆయన పాటలు పాడి గొప్ప గాయకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. ఆయన తనయుడు కూడా సింగర్ గా అరంగేట్రం చేసి తండ్రి లాగానే దినదినాభివృద్ధి చెందుతున్నాడు. కేజే ఏసుదాస్ రెండవ కుమారుడు అయిన విజయ్ ఏసుదాస్ గాయకుడిగా చిత్ర రంగ ప్రవేశం చేసి తమిళ మలయాళ తెలుగు భాషలల ఎన్నో పాటలు పాడి ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్నాడు.

2000 వ సంవత్సరంలో మలయాళ చిత్రం తో తన కెరీర్ మొదలు పెట్టి ఇప్పటివరకు మూడు వందలకు పైగా పాటలు పాడాడు. కేరళ రాష్ట్ర చలన చిత్ర పురస్కారాలను, నాలుగు ఫిలింఫేర్ అవార్డులను అందుకుని ఎన్నో రికార్డును సాధించాడు. 1997లో కర్ణాటక సంగీతం నేర్చుకుని భారీ సాధన చేసి ఇప్పుడు ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. యువన్ శంకర్ రాజా ఇళయరాజా ఏ ఆర్ రెహమాన్ మణి శర్మ కీరవాణి వంటి సంగీత దర్శకులతో కలిసి పని చేసిన అనుభవం ఉంది ఆయనకు. 

యంగ్ సంగీత దర్శకులతో కూడా పని చేస్తూ ఆయన రోజు రోజుకు స్టార్ సింగర్ అయ్యే విధంగా గా గొప్ప అడుగులు వేస్తున్నాడు. తెలుగు లో ఆయన లెజెండ్ సినిమాలో పాడిన నీ కంటి చూపుకు అనే పాటకు ఆయన కు నంది అవార్డు కూడా దక్కింది. ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించడం విశేషం. తెలుగు లో 2002 సంవత్సరంలో నీతో అనే సినిమాకి ఆయన తొలి పాట పాడగా గుణ 369 చిత్రం తర్వాత ఆయన ఇటీవలే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో మలయాళంలో ఓ పాట పాడారు. ఈ పాట కు ఏ రేంజ్ లో స్పందన వచ్చిందో తెలిసిందే.
 

మరింత సమాచారం తెలుసుకోండి: