సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. ప్రస్తుతం సర్కారు వారిపాట సినిమాలో నటిస్తున్నాడు.ఆ తర్వాత కొంతమంది డైరెక్టర్లతో మూడు సినిమాలకు కమిట్ అయినట్లు సమాచారం.ఈ సినిమాలు కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయని నమ్మకంతో తన అభిమానులు భావిస్తున్నారు.అసలు విషయానికి వస్తే మహేష్ బాబు చేతిలో ఉన్న ఈ చిన్నారి ఫోటో ప్రస్తుతం బాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఆ వివరాలు చూద్దాం.


మహేష్ బాబు సాక్షి శివానంద్, సిమ్రాన్ కలిసి నటించిన చిత్రం యువరాజు. ఈ సినిమాలొ సిమ్రాన్ కు కూతురుగా ఒక చిన్నారి నటించింది.ఆమె ఇప్పుడు ఒక హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.ఆమె ఎవరో కాదు శ్రీదివ్య కావడం విశేషం. తెలుగులో మొదటిసారిగా బస్టాప్ సినిమాతో తన కెరీర్ ని మొదలు పెట్టి. ఆతర్వాత కేరింత,కాష్మోరా వంటి సినిమాలలో నటించింది.

ఇక ప్రస్తుతం ఈమె తమిళ సినిమాలలో బిజీగా ఉంటోంది, ఇలా తెలుగులోనే కాకుండా కోలీవుడ్ సినిమాల్లో కూడా మంచి ఆఫర్లను అందుకుంటోంది శ్రీదివ్య. ఇక తన చైల్డ్హుడ్ ఫోటో కి ప్రస్తుతం ఉన్న ఫోటోలకు గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం అప్పటికీ ఇప్పటికీ వన్నె తరగని అందగాడుగానే.. కనిపిస్తున్నాడు అంటూ ఈ ఫోటో చూసిన నెటిజన్లు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.
ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే మహేష్ బాబు తో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ లు అందరూ మారిపోతున్న మహేష్ బాబు మాత్రం అలాగే ఉండడం విశేషం. మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా జనవరి 13 న 2022 వ సంవత్సరంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.ఇక ఈ సినిమాకు పోటీగా బీమ్ లో నాయక్ సినిమా ను కూడా విడుదల చేస్తున్నారు. అయితే బాక్సాఫీస్ బరిలో ఏ సినిమా విన్నర్గా నిలబడుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: