పవన్ కళ్యాణ్ ఇటీవలే చేసిన ఓ సెన్సేషనల్ స్పీచ్ టాలీవుడ్లోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెను సంచలనాలను కలిగిస్తుంది. రాజకీయంగా పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు సీఎం జగన్ ని టార్గెట్ చేసిన విధంగా ఉండటంతో ఆయన మద్దతుదారులు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడుతున్నారు. తమదైన శైలిలో ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కూడా పవన్ కళ్యాణ్ మాటలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆయనకు మద్దతు కూడా ఇవ్వటం లేదు.

ఫిలిం ఛాంబర్ ఇటీవలే పవన్ కళ్యాణ్ మాటలు పూర్తిగా వ్యక్తిగతమైనవి.. వాటికి తమకు ఏమాత్రం సంబంధం లేదు.. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తున్న తీరు మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అని వారు కూడా లేఖ విడుదల చేశారు.  ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్  స్పీచ్ ఆయన చేయబోయే సినిమాల నిర్మాతల పై పడబోతోంది అని ఇప్పుడు తెలుస్తుంది.  ఆయన హీరోగా భీమ్ల నాయక్, హరిహర వీరమల్లు మరియు భవదీయుడు భగవద్గీత అనే మూడు సినిమాలు తెరకెక్కుతు ఉండగా వాటిలో భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాల నిర్మాతలు తమ సినిమాల పై పవన్ స్పీచ్ ప్రభావం చూపుతుందని చాలా టెన్షన్ పడుతున్నారట. ఇప్పటికే ఏపీలో థియేటర్ల సమస్య ఉండడంతో ఏ సినిమా కూడా మేకర్స్ ను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేక పోతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పీచ్ తో ఆ ఇబ్బంది కాస్త ఇంకా పెరిగినట్లుగా కనిపిస్తుంది.  ముఖ్యంగా పవన్ సినిమాలకు ఈ ఇబ్బంది ఇంకా ఎక్కువ ఏ విధంగా ఉంటుందని నిర్మాతలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ సినిమాలను ఓ టీ టీ లో విడుదల చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. భీమ్ల నాయక్ ను ఓ టీ టీ కే ఇచ్చే విధంగా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: