చిరంజీవి ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కాకుండానే చిరంజీవి ఇండస్ట్రీ గాడ్ ఫాదర్ గా ఎంతవరకు ఇండస్ట్రీని ప్రభావితం చేస్తున్నాడు అన్నవిషయం ఆదివారం నాడు జరగబోతున్న ‘మా’ సంస్థ ఎన్నికలు తెల్చబోతున్నాయి.



ఇలాంటి పరిస్థితులలో టాలీవుడ్ ఇండస్ట్రీ ‘గాడ్ ఫాదర్’ స్థానం పై ఇప్పుడు ఆసక్తికర చర్చలు ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతున్నాయి. వాస్తవానికి దాసరి నారాయణరావు జీవించి ఉన్నంత కాలం ఎవరికీ ఏసమస్య వచ్చినా ఆయన రంగంలోకి దిగి ఆసమస్యను పరిష్కరిస్తూ ఉండేవారు. దీనితో చిరంజీవి పెద్దరికం చేయవలసిన పరిస్థితులు అప్పట్లో ఉండేవి కావు.



దాసరి మరణం తరువాత ఇండస్ట్రీ పెద్ద హోదా పదవికి ఖాళీ ఏర్పడినప్పటికీ ఆస్థానం గురించి బాలకృష్ణ మోహన్ బాబు వెంకటేష్ నాగార్జున లు పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. వారివారి వ్యక్తిగత సమస్యలు తమ సినిమాలు గురించి పట్టించుకున్నారు తప్ప ఇండస్ట్రీ సమస్యల గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఆపరిస్థితులలో రంగంలోకి దిగిన చిరంజీవి తన ఇండస్ట్రీ పెద్దన్న పాత్రను సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా కరోనా పరిస్థితులలో ఒక ఫండ్ ను ఏర్పాటు చేసి చాలామందికి సహాయం చేసాడు.



అయితే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులలో తన ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా అనేకమందికి సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ పూర్తిగా ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి మారలేకపోయాడా అన్నసందేహాలు కొందరికి వస్తున్నాయి. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు వచ్చిన ‘మా’ సంస్థ ఎన్నికలు ఇప్పుడు ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోయి ‘మా’ సంస్థ ఎన్నికలలో పోటీ చేస్తోంది. కొంతకాలంగా ఇండస్ట్రీ రాజకీయాలకు దూరంగా ఉన్న మోహన్ బాబు ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా ‘మా’ ఎన్నికలలో విష్ణు రూపంలో తన ఇండస్ట్రీ పెద్దరికాన్ని నిలుపు కోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు ‘మా’ ఎన్నికలలో విష్ణు ప్యానల్ నెగ్గితే ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి లేదా మోహన్ బాబు అన్నది ప్రశ్నార్థకం..




మరింత సమాచారం తెలుసుకోండి: