ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా కొనసాగుతున్నారు మెగా స్టార్ చిరంజీవి.  అంతే కాదు టాలీవుడ్ లో అటు మెగా ఫ్యామిలీ అతిపెద్ద ఫ్యామిలీగా కొనసాగుతుంది.  ఒక రకంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీకి కాస్త ఆధిపత్యం కూడా ఉంది అని చెప్పొచ్చు.  అలాంటి మెగా ఫ్యామిలీ ఇటీవలే హర్ట్ అయింది అన్న టాక్ గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తుంది.  ఎందుకంటే ఇటీవలే జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓడిపోవడమే. సాధారణంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు వచ్చాయి అంటే చాలు..  అభ్యర్థులు మెగా ఫ్యామిలీ సపోర్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.


 ఎందుకంటే మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అంటే ఇక దాదాపుగా గెలుపు ఖరారు అయినట్లే అని నమ్ముతూ ఉంటారు అభ్యర్థులు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజు మెగా ఫ్యామిలీ మద్దతు కూడగట్టుకున్నాడు..  మరో వైపు నుంచి టాలీవుడ్ లో మరో పెద్ద ఫ్యామిలీ గా కొనసాగుతున్న మంచు వారి ఫ్యామిలీ నుంచి బరిలోకి ఏకంగా వారసడు దిగడం హాట్ టాపిక్ గా మారిపోయింది.  చివరికి మెగా ఫ్యామిలీ మద్దతు ఇచ్చిన్నప్పటికీ ప్రకాష్ రాజు ఓడిపోయారు.
 అయితే తాము సపోర్ట్ చేసినప్పటికీ ప్రకాష్ రాజు ఓడిపోవడంతో  మెగా ఫ్యామిలీ కాస్త హార్ట్ అయ్యిందట. ఏకంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు గెలవగానే నాగబాబు తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇలా రోజుకు ఒక అంశం తెరమీదకి వస్తూ హాట్ టాపిక్ గా మారిపోతుంది దీనిబట్టి చూస్తే ఇక మెగా ఫ్యామిలీ మాట వినకపోతే మా నాశనమవుతుందా అని అంటున్నారు చాలామంది. మెగా ఫ్యామిలీ ఆధిపత్యం కోసమే అటు ప్రకాశ్ రాజ్ కు మద్దతు ఇచ్చిందని  ఎవరికి ఓటమి పాలు కావడంతో కాస్త హార్ట్ అయింది అంటూ టాక్ వినిపిస్తుంది. ఆ రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: