
టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ మోహబ్ బాబు పేరు తెలియని వారు అంటూ ఉండరు. ఆయన కి ఇద్దరు కొడుకులు..ఒక కుమార్తే. ఇక మొహన్ బాబు పెద్ద కుమారుడే ఈ మంచు విష్ణు. ఈయన హీరోగా ఎన్నో సినిమాలు చేసాడు. దాంట్లో హిట్టైన సినిమాలు చాలా తక్కువ. అయినా కానీ హిట్ లతో ఫ్లాప్ లతో సంబంధం లేకుండా..వరుసుగా సినిమాలు తీసుకుంటూ పోతున్నాడు.
ఇక ఈయన రీసెంట్ గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. మంచు విష్ణు తన అపోజిషన్ ప్యానల్ అయిన ప్రకాశ్ రాజ్ ను దారుణంగా ఓడించి..మా అధ్యక్ష పీఠం కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు పలువురు సినీ తారాలు నుండి ప్రముఖుల నుండి శుభకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక ఈయన వ్యకతిగత విషయానికి వస్తే.. మంచు విష్ణు భార్య పేరు విరానికా రెడ్డి. వీళ్లది లవ్ మ్యారేజ్. నిజానికి ఈ విరానికా రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కు వరుసకు చెల్లిలు అవుతుంది. వై యస్ రాజారెడ్డి నాలుగవ కుమారుడు సుధాకర్ రెడ్డి..ఆయన కూతురునే ఈ విరానికా రెడ్డి.
విరానికా అమెరికాలోనే పుట్టి..అక్కడే పెరిగి..బాగా చదువుకుంది. విరానికాకి పబ్లిసిటీ అంటే ఎక్కువగా ఇష్టం ఉండదు. అందుకే సోషల్ మీడియాకి వీలైనంత దూరంగా ఉంటుంది. విరానికా రెడ్డి కి పిల్లలను కనడం అంటే చాలా ఇష్టం. ఈ విషయం ఆమె స్వయానా ఓ ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చింది. ఇక మంచు విష్ణు-విరానికా రెడ్డి దంపతులకు నలుగురు పిల్లలు అన్న విషయం తెలిసిందే.