బిగ్ బాస్ అనే కార్యక్రమం ద్వారా ఎంతో మంది సినీ సెలబ్రిటీల గా మారిపోతున్నారు. ఇక ఇలా గత సీజన్లో బిగ్బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సోహెల్. అప్పటివరకు తెలుగు ప్రేక్షకులకు అపరిచితుడు గా  ఉన్న సోహెల్ బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ చేసి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న సోహెల్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు  ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉండే సోహెల్ కథ వేరే ఉంటది అనే డైలాగుతో ఎంతగానో ఫేమస్ అయ్యాడు అని చెప్పాలి. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ లు కూడా చేసి ఆకట్టుకున్నాడు సోహెల్.



 బిగ్బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సోహెల్ వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఇటీవలే సోహెల్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాకు సంబంధించి టీజర్ కూడా విడుదల అయింది. అయితే సోహెల్ ఇటీవలే ఈ టీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యాడు.  ఇక ఈ కార్యక్రమంలో అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి ఆకట్టుకున్నాడు పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ ఎంట్రీ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది అన్న విషయం తెలిసిందే. ఈ సాంగ్ ఏకంగా సోషల్ మీడియాను ఊపేసింది.



 అయితే ఇక ఇదే పాట పై అటు బిగ్ బాస్ షో ఫేమ్ సోహెల్ ఈటీవీ లో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు. తన పర్ఫామెన్స్ తో అక్కడున్న వారందరినీ కూడా ఫిదా చేశాడు అనే చెప్పాలి. ఇటీవలే విడుదలైన ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక బిగ్ బాస్ సోహెల్ పర్ఫామెన్స్ పై స్పందించిన జడ్జి ఇంద్రజ మీరు ఎంతో స్టైల్గా అద్భుతంగా డాన్స్ చేశారు అంటూ కామెంట్ కూడా చేస్తుంది.  ఈ ప్రోమో ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: